తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంతో మంది హీరోయిన్లు వస్తుంటారు.. వెళ్తుంటారు. కానీ కొందరు మాత్రం తొలి సినిమాతోనే ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంటారు.
అలాంటి నటీమణుల్లో ఫరియా అబ్దుల్లా ఒకరు. జాతి రత్నాలు సినిమాలో చిట్టి పాత్రతో ఒక్కసారిగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఆమె.. ఆ తర్వాత విభిన్నమైన పాత్రలు చేస్తూ దూసుకుపోతుంది.
ఫరియా అబ్దుల్లాకు నటిగా మంచి గుర్తింపు తీసుకొచ్చిన సినిమా జాతి రత్నాలు. ఈ సినిమాలో ఫరియా.. తనదైన కామెడీ టైమింగ్, ఎనర్జీ, స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకుంది.
సినిమా విజయంలో ఆమె పాత్ర కూడా ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయింది. ఇప్పటికీ చాలామంది ఆమెను ‘చిట్టి’ పేరుతోనే గుర్తిస్తుండటం విశేషం.
సినిమాల్లోకి రాకముందే ఫరియాకు రంగస్థల అనుభవం ఉంది. హైదరాబాద్‌లో సుమారు ఆరు సంవత్సరాల పాటు థియేటర్ ఆర్టిస్ట్‌గా పనిచేసినట్లు ఆమె స్వయంగా వెల్లడించింది.
నటనతో పాటు డాన్స్, మ్యూజిక్, క్రియేటివ్ ఆర్ట్స్‌పై కూడా ఆమెకు ఆసక్తి ఉంది. ముఖ్యంగా డాన్స్‌ను తన జీవితంలో ఎంతో ముఖ్యమైన భాగంగా భావించే ఫరియా.
తొలి సినిమాతో వచ్చిన ఇమేజ్‌కు మాత్రమే పరిమితం కాకుండా ఫరియా వరుసగా కొత్త తరహా పాత్రలు చేస్తూ వచ్చింది. ఇప్పుడు సిగ్మా