AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ది ప్యారడైజ్‌లో సమ్మక్క ఎవరు.? నాని కామెంట్స్‌తో పెరిగిన క్యూరియాసిటీ!

నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. వీరిద్దరి కలయికలో గతంలో వచ్చిన దసరా మంచి విజయాన్ని అందుకోవడంతో.. ఈ సినిమాపై మొదటి నుంచే ఆసక్తి ఏర్పడింది. అందుకు తగ్గట్టుగానే చిత్రబృందం కూడా వినూత్నంగా ప్రమోషన్స్ చేస్తోంది.

ది ప్యారడైజ్‌లో సమ్మక్క ఎవరు.? నాని కామెంట్స్‌తో పెరిగిన క్యూరియాసిటీ!
Nani
Rajeev Rayala
|

Updated on: Sep 19, 2026 | 9:53 AM

Share

నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ది ప్యారడైజ్ పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. గతంలో ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన దసరా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడంతో.. మరోసారి వీరి కాంబోపై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఈసారి మరింత భారీ స్థాయిలో, పాన్ ఇండియా మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ ‘ది ప్యారడైజ్’ను రూపొందిస్తున్నారు. సినిమా విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్‌ను ముమ్మరం చేసింది. వరుస ఇంటర్వ్యూలు, మీడియా ఇంటరాక్షన్స్, ప్రమోషనల్ కార్యక్రమాలతో మూవీపై హైప్‌ను మరింత పెంచుతున్నారు. ఈ క్రమంలో హీరో నాని చేసిన ఓ ఆసక్తికర కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.

Aditi Myakal : మేడమ్ సార్ మేడమ్ అంతే..! మెంటలెక్కిస్తున్న అర్జున్ రెడ్డి భామ

తాజా మీడియా ఇంటరాక్షన్‌లో నానిని సినిమా టైటిల్‌కు సంబంధించి ప్రశ్నించగా.. ఒకవేళ ‘ది ప్యారడైజ్’ అనే టైటిల్ కాకుండా మరో పేరు పెట్టాల్సి వస్తే ‘సమ్మక్క’ అనే టైటిల్ తన దృష్టిలో ఈ కథకు వంద శాతం సరిపోతుందని అన్నారు నాని. నాని నోటి నుంచి వచ్చిన ఈ పేరు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించింది. అసలు భారీ యాక్షన్ కథాంశంతో తెరకెక్కుతున్న సినిమాకు ‘సమ్మక్క’ అనే టైటిల్ ఎందుకు అంతగా సరిపోతుంది.? ఈ పేరుకు కథతో ఉన్న సంబంధం ఏమిటి.? అనే ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఒకే ఒక్క సినిమా.. విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది.. కట్ చేస్తే సోషల్ మీడియాను షేక్ చేస్తుంది

ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. సినిమాలో నాని తల్లి పాత్ర పేరు సమ్మక్క అని తెలుస్తోంది. అంతేకాదు, కథలో ఈ పాత్రకు చాలా కీలకమైన ప్రాధాన్యత ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. హీరో పాత్ర ప్రయాణానికి ఈ మదర్ క్యారెక్టర్ బలమైన ఎమోషనల్ బ్యాక్‌డ్రాప్‌గా నిలుస్తుందని సమాచారం. అందుకే కేవలం యాక్షన్, మాస్ ఎలిమెంట్స్‌తో మాత్రమే కాకుండా.. తల్లి, కొడుకు మధ్య ఉండే ఎమోషనల్ బంధం కూడా కథలో ప్రధానంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే నాని ‘సమ్మక్క’ అనే పేరు కథకు పూర్తిగా సరిపోతుందని చెప్పారా.? అనే ఆసక్తి ప్రేక్షకుల్లో మరింత పెరిగింది. కాగా భారీ అంచనాల మధ్య ‘ది ప్యారడైజ్’ సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. నాని-శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ ఈసారి ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

అప్పుడు తెలుగులో క్రేజీ హీరోయిన్.. కట్ చేస్తే మాజీ సీఎం భార్య.. ఇద్దరి మధ్య 27ఏళ్ల ఏజ్ గ్యాప్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us