నటి సమంత రూత్ ప్రభు మాట్లాడుతూ, సారీ చెప్పాల్సిన పరిస్థితి వస్తే పురుషుల కంటే స్త్రీలే పది రెట్లు ఎక్కువగా క్షమాపణలు చెబుతారని అన్నారు. చిన్న విషయాలకు సారీ చెప్పే అలవాటును మార్చుకోవాలని ఆమె సూచించారు. ప్రశంసలను స్వీకరించడానికి, కష్టపడి సంపాదించుకున్న గౌరవాన్ని అనుభవించడానికి మహిళలకు హక్కు ఉందని సమంత స్పష్టం చేశారు.