మలయాళ నటి హనీ రోజ్ కేరళలోని ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో చేదు అనుభవం ఎదుర్కొన్నారు. సెల్ఫీ దిగుతున్న సమయంలో కొందరు ఆమెను అసభ్యంగా తాకేందుకు ప్రయత్నించారు. దీంతో ఆమె అసౌకర్యానికి గురై అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోయారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.