AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జూ.ఎన్టీఆర్‌కు లవర్‌గా, హరికృష్ణకు కోడలిగా నటించిన ఏకైక టాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలుసా? ఇప్పుడు సినిమాలు మానేసి..

నందమూరి నట సార్వభౌముడు ఎన్టీఆర్ మనవడిగా, హరికృష్ణ కుమారుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు జూనియర్ ఎన్టీఆర్. తనదైన అభినయంతో అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ లో స్టార్ హీరోగా మారిపోయాడు. ఆ తర్వాత గ్లోబల్ స్టార్ గా ఫేమస్ అయ్యాడీ మ్యాన్ ఆఫ్ మాసెస్.

జూ.ఎన్టీఆర్‌కు లవర్‌గా, హరికృష్ణకు కోడలిగా నటించిన ఏకైక టాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలుసా? ఇప్పుడు సినిమాలు మానేసి..
Jr NTR, Harikrishna
Basha Shek
|

Updated on: Nov 25, 2025 | 9:46 PM

Share

సీనియర్ ఎన్టీఆర్ వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు హరికృష్ణ, ఛైల్డ్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో నటించారు. ఆ తర్వాత హీరోగానూ, సహాయక నటుడిగానూ మెప్పించారు. శ్రీరాములయ్య, సీతారామరాజు, లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య, టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్, స్వామి, శ్రావణమాసం తదితర సినిమాల్లో కథానాయకుడిగా మెప్పించారు హరికృష్ణ. ఇక ఈయన తర్వాత సినిమా ఇండస్ట్రీలో నందమూరి వారసత్వాన్ని జూనియర్ ఎన్టీఆర్ కొనసాగిస్తున్నారు. ఇతను కూడా ఛైల్డ్ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో నటించి మెప్పించాడు. ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అతి పిన్న వయసులోనే అద్బుతమైన నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ రేంజ్ పాన్ వరల్డ్ కు పాకింది. కాగా హరికృష్ణతో ఎంతో మంది హీరోయిన్లు కలిసి నటించారు.భానుప్రియ, సౌందర్య, రమ్యకృష్ణ, సిమ్రాన్ వంటి అందాల తారలు హరికృష్ణతో జోడీ కట్టారు. అలాగే ఎన్టీఆర్ తోనూ ఎంతో మంది అందాల తారలు రొమాన్స్ చేశారు. అమీషా పటేల్, సమీరా రెడ్డి, అలియా భట్ వంటి బాలీవుడ్ హీరోయిన్లు కూడా ఎన్టీఆర సరసన చేరారు. ఇక రమ్యకృష్ణ అయితే ఇద్దరు తండ్రీ కొడుకులతోనూ ఆడిపాడింది. అయితే ఒక టాలీవుడ్ హీరోయిన్ మాత్రం జూనియర్ ఎన్టీఆర్ కు కోడలిగా,హరికృష్ణకు కోడలిగా నటించింది. ఆమె మరెవరో కాదు ఒకప్పుడు తన అందంతో కుర్రకారును గిలిగింతలు పెట్టిన గజాలా.

జూనియర్ ఎన్టీఆర్ నటించిన సూపర్ హిట్ సినిమాల్లో ‘స్టూడెంట్ నెం.1’ ఒకటి. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో గజాల హీరోయిన్‌గా నటించింది. దీని తర్వాత అల్లరి రాముడు సినిమాలోనూ గజాలా యాక్ట్ చేసింది. ఇందులో ఆమె తారక కు మరదలిగా నటించింది.

ఇక హరికృష్ణతో కూడా నటించింది గజాల. పోసాని కృష్ణ మురళి తెరకెకక్కించిన శ్రావణ మాసం సినిమాలో హరికృష్ణ, కృష్ణ ప్రధాన పాత్రలు పోషించారు. ఇదే సినిమాలో గజాలా కూడా కీలక పాత్ర పోషించింది. కృష్ణ కూతురిగా, హరికృష్ణ కోడలిగా ఆమె కనిపించింది. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. అలా ఎన్టీఆర్ కు లవర్ గా, హరికృష్ణకు కోడలిగా నటించిన ఏకైక హీరోయిన్ గా గజాలా గుర్తింపు తెచ్చుకుంది. పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించిన గజాలా ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటోంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది

ఇవి కూడా చదవండి
Gajala

Gajala

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి