OTT Movie: ఈ సినిమా చూశాక భార్యను తిట్టాలంటే భయపడతారు.. ఓటీటీలో బుర్రపాడు చేసే క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ..
వివాహేతర సంబంధాలు ఎలాంటి అనర్థాలకు దారి తీస్తాయో ఇటీవల కాలంలో బాగా చూసే ఉంటాం. మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసు, మీర్ పేటలో భార్యను చంపి కుక్కర్ లో ఉడికించిన సంఘటనలను గుర్తుకు తెచ్చుకుంటేనే ఒళ్లు జలదరిస్తుంది. ఈ సినిమా కూడా సేమ్ టు సేమ్ ఇలాంటి స్టోరీతోనే నడుస్తుంది.

ఓటీటీ ప్లాట్ ఫామ్స్ అన్ని రకాల సినిమాలు సినిమాలు, వెబ్ సిరీస్ లు ఉంటాయి. అయితే ఈ మధ్యన సస్పెన్స్, క్రైమ్, హారర్ సినిమాలకు మంచి ఆదరణ దక్కుతోంది. ఓటీటీలో వీటికి రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి. ఈ క్రమంలోనే కొన్ని ఓటీటీ సంస్థలు కొన్ని సినిమాలు, వెబ్ సిరీస లను సొంతంగా నిర్మించి డైరెక్టుగా స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా సేమ్ టు సేమ్ ఇలాగే ఓటీటీలోకి వచ్చింది. ఇదొక తెలుగు వెబ్ సిరీస్. ఆద్యంతం ఉత్కంఠభరిత సన్నివేశాలతో సాగే ఈ సిరీస్ ను ఒక్కసారి చూడడం స్టార్ట్ చేస్తే క్లైమాక్స్ వరకు అసలు ఆగరు. ఆసక్తికరమైన కథా కథనాలు, ఉత్కంఠ భరిత సన్నివేశాలు, అద్దరిపోయే ట్విస్టులు ఆడియెన్స్ కు మంచి థ్రిల్ అందిస్తాయి. ఈ సిరీస్ కథ విషయానికి వస్తే.. అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్న ఒక జంట జీవితం ఒక్క రాత్రిలోనే ఎలా తలకిందులవుతుందో ఈ సినిమాలో చూపించారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ వికాస్ కి అమృత అనే అమ్మాయితో పెళ్లి జరుగుతుంది. పెద్దలు కుదిర్చిన వివాహం కాబట్టి వీరు కుదురుకోవడానికి కొద్దిగా సమయం తీసుకుంటారు. హనీమూన్ కి కూడా వెళ్లి వస్తారు.
అయితే ఇంటికి వచ్చీరాగానే ఒక రోజు రాత్రి సమయంలో ఒక్కసారిగా గొడవ పడతారు వికాస్- అమృత. ఆ గొడవలో అనుకోకుండా అమృత చేతిలో భర్త చనిపోతాడు. భయపడిపోయిన అమృత భర్త శవం దాచేందుకు ప్రయత్నిస్తుంది. కానీ అదే సమయంలోనే ఇంటికి వచ్చేసిన వికాస్ స్నేహితుడు రోహిత్ పరిస్థితిని చూసి షాకవుతాడు. ఇక్కడి నుంచి అసలు కథ ప్రారంభమవుతుంది. రోహిత్, అమృత ఇద్దరూ శవం దాచే ప్రయత్నంలో ఒకరినొకరు బ్లాక్ మెయిల్ చేసుకుంటారు. దీంతో సినిమాలో ఎవరు బాధితులు, ఎవరు విలన్లు అనేది ఒక పట్టాన అర్థం కాదు. అసలు వికాస్- అమృతలు పెళ్లి ఎలా జరిగింది? వీరి మధ్యలోకి రోహిత్ ఎందుకొచ్చాడు? అసలీ మర్డర్ స్టోరీలో చివరకు ఏం జరిగింది? అన్నది తెలుసుకోవాలంటే ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ చూడాల్సిందే.
ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ పేరు ‘అబద్ధం వెనుక’. ఈ వెబ్ సినిమాను ప్రముఖ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్ నిర్మించడం గమనార్హం. అమృత శ్రీనివాసన్, వికాస్, రోహిత్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ జీ5లో అందుబాటులో ఉంది. తెలుగు వెర్షన్ కూడా స్ట్రీమింగ్ అవుతోంది.
అబద్ధం వెనక సిరీస్ తెలుగు ట్రైలర్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




