The Girlfriend OTT: ఓటీటీలో రష్మిక లేటెస్ట్ బ్లాక్ బస్టర్.. ‘ది గర్ల్‌ఫ్రెండ్’ స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటించిన లేటెస్ట్ సినిమా ది గర్ల్ ఫ్రెండ్. అందాల రాక్షసి ఫేమ్ రవీంద్రన్ తెరకెక్కించిన ఈ సినిమాలో దసరా ఫేమ్ దీక్షిత్ శెట్టి మరో కీలక పాత్ర పోషించాడు. నవంబర్ 07న థియేటర్లలో విడుదలైన ఈ లవ్ ఎంట్‌ర్‌టైనర్ సూపర్ హిట్ గా నిలిచింది.

ఓవైపు స్టార్ హీరోలతో కలిసి పాన్ ఇండియాల్లో నటిస్తోన్న రష్మిక మందన్నా మరోవైపు లేడీ ఓరియంటెడ్ మూవీస్ తోనూ మెప్పిస్తోంది. తాజాగా ఆమె నటించిన సినిమా ది గర్ల్ ఫ్రెండ్. అందాల రాక్షసి సినిమాతో హీరోగా మెప్పించి చిలసౌ సినిమాతో జాతీయ అవార్డు అందుకున్న రాహుల్ రవీంద్రన్ ఈ లేడీ ఓరియంటెడ్ సినిమాను తెరకెక్కించడం విశేషం. దసరా ఫేమ్ దీక్షిత్ శెట్టి రష్మికకు జోడీగా నటించాడు. నవంబర్ 07న థియేటర్లలో విడుదలైన ఈ టాక్సిక్ లవ్ స్టోరీ సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా రూ. 25 కోట్లకు పైగానే కలెక్షన్లు సాధించింది. టాక్సిక్ బాయ్ ఫ్రెండ్స్ ఉన్న అమ్మాయిలు పర్సనల్‌గా.. ప్రొఫెషనల్‌గా ఎలా ఇబ్బంది పడుతున్నారన్న విషయాన్ని ఈ సినిమాలో చక్కగా చూపించారు డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్. దీంతో చాలా మంది అమ్మాయిలు ది గర్ల్ ఫ్రెండ్ సినిమాను ఓన్ చేసుకున్నారు. అదే సమయంలో ఓ అమ్మాయి ఈ సినిమా చూసి చున్నీ తీసేసి ‘నేను కూడా ఇలాగే జీవిస్తాను’ అంటూ చెప్పడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికీ ఈ సినిమా థియేటర్లలో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో ఆడుతుండడం విశేషం.
అమ్మాయిలకు తెగ నచ్చేసిన ది గర్ల్ ఫ్రెండ్ సినిమా ఓటీటీలో చూడాలని చాలా మంది ఉవ్విళ్లూరుతున్నారు. ఈ నేపథ్యంలో రష్మిక సినిమా ఓటీటీ రిలీజ్ గురించి సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.ఇందుకోసం చిత్ర నిర్మాతలకు ఏకంగా రూ. 14 కోట్లు చెల్లించినట్లు సమాచారం. ఒప్పందం ప్రకారం డిసెంబర్ 11 నుంచి ది గర్ల్ ఫ్రెండ్ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ప్రస్తుతానికి ఇది కేవలం రూమర్ మాత్రమే. త్వరలోనే దీనిపై ఓ అధికారిక ప్రకటన వెలువడనుంది.
రష్మిక సినిమా గురించి ఒక మహిళ మాటల్లో..
#TheGirlFriend is a film for all ages. Everyone will have something to take away from this film ❤️
Book your tickets for THE BEST TELUGU FILM OF THE YEAR now! 🎟️ https://t.co/aASxyrtyIG pic.twitter.com/XgwCB6pWgs
— Geetha Arts (@GeethaArts) November 15, 2025
అల్లు అరవింద్, ధీరజ్ మొగిలినేని సంయుక్తంగా నిర్మించిన ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్ మరో కీలక పాత్ర పోషించింది. రావు రమేశ్, రోహిణీ తదితరులు వివిధ పాత్రల్లో మెరిశారు.








