Producer SKN: మీ మీద గౌరవం పెరిగింది సార్.. మహేష్ బాబు అభిమాని కుటుంబానికి నిర్మాత ఎస్కేఎన్ భారీ ఆర్థిక సాయం..
సినిమా ఈవెంట్లలో ఉపన్యాసాలు, కామెంట్స్, సోషల్ మీడియా పోస్టులతో తరచూ వార్తల్లో నిలుస్తుంటారు టాలీవుడ్ ప్రముఖ నిర్మాత ఎస్కేఎన్ అలియాస్ శ్రీనివాస్ కుమార్. ఒక్కోసారి తన వ్యాఖ్యలతో ట్రోలింగ్, విమర్శలు కూడ ఎదుర్కొంటుంటారీ ఫేమస్ ప్రొడ్యూసర్. అయితే ఆయన గురించి ఎవరేమనుకున్నా ఒక్క విషయంలో మాత్రం ఎస్కేఎన్ ను అందరూ మెచ్చుకుని తీరాల్సిందే.

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత ఎస్కేఎన్ అలియాస్ శ్రీనివాస్ కుమార్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. బేబీ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారాయన. ప్రస్తుతం ప్రభాస్ ది రాజాసాబ్ తో పాటు పలు సినిమాలను నిర్మిస్తున్నారు ఎస్కేఎన్. ఇదిలా ఉంటే సినిమా ఈవెంట్లలో తన ఉపన్యాసాలు, కామెంట్స్, సోషల్ మీడియా పోస్టులతో తరచూ వార్తల్లో నిలుస్తుంటారు ఎస్కేఎన్. ఒక్కోసారి తన కామెంట్స్ తో ట్రోలింగ్, విమర్శలు కూడ ఎదుర్కొంటుంటారు. అయితే ఆయన గురించి ఎవరేమనుకున్నా ఒక్క విషయంలో మాత్రం ఎస్కేఎన్ ను అందరూ మెచ్చుకుని తీరాల్సిందే. కుడి చేత్తో చేసిన సాయం ఎడమ చేతికి కూడా తెలియకూడదన్న మాటను నిజం చేస్తూ గుప్త దానాలు చేస్తుంటారు ఎస్కేఎన్. కష్టాల్లో ఉన్న ఎంతో మందికి అండగా నిలుస్తున్నారీ టాలీవుడ్ ప్రొడ్యూసర్. ఇబ్బందుల్లో ఉన్నామని ఎవరైనా సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే చాలు వెంటనే రెస్పాండ్ అవుతారాయన. అన్ని విషయాలు కనుక్కుని మరీ సాయం చేస్తారు. అలా ఎంతో మందికి ఆపన్న హస్తం అందించిన ఎస్కేఎన్ తాజాగా మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు.
ఇటీవల మహేష్ బాబు అభిమాని ఒకరు చనిపోయారు. అతనికి భార్య, అబ్బాయికి 10 సంవత్సరాలు కొడుకు మరియు ఆరు సంవత్సరాలు కూతురు కూడా ఉన్నారు. దీంతో అభిమాని కుటుంబాన్ని ఆదుకోవాలంటూ మేష్ నాయక్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. ‘మనలో ఒకడు ఈ రోజు మనల్ని వదిలివెళ్లిపోయాడు. మహేష్ అన్న ఫ్యాన్స్, మన తెలుగు యువత అందరి హీరో ఫ్యాన్స్ అందరూ మీకు తోచినంత హెల్ప్ చేయండి’ అంటూ అందులో రాసుకొచ్చాడు. నిర్మాత ఎస్కేఎన్ గొప్ప మనసు గురించి తెలుసుకున్న రమేష్ నాయక్ తన పోస్టుకు నిర్మాతను కూడా ట్యాగ్ చేశాడు. దీంతో నిర్మాత ఎస్కేఎన్ వెంటనే స్పందించారు.
మహేష్ బాబు అభిమాని కుటుంబ సభ్యులతో నిర్మాత ఎస్కేఎన్..
Once again, cult producer @SKNonline proved his generosity 🙏#SKN extended financial support by donating ₹2 lakh to help the family of a Mahesh Babu fan who recently passed away, contributing towards the children’s education ❤️❤️ pic.twitter.com/1ucmptqhqr
— Meghasyam Pathada (@iammeghasyam) November 19, 2025
‘ ఒక అభిమానిగా ఇంకొక అభిమాని ఎమోషన్ నేను అర్థం చేసుకోగలుగుతాను. ప్రస్తుతం విద్య అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ల పిల్లలకు అది దూరం కాకూడదు. నేను రెండు లక్షల రూపాయలు నా సైడ్ నుంచి వాళ్ల చదువుల నిమిత్తం ఇస్తాను’ అని ట్విట్టర్ వేదికగా ప్రామిస్ చేశాడు ఎస్కేఎన్. ఇప్పుడు చెప్పిన మాదిరిగానే ఆ ఫ్యామిలీని కలిసి రెండు లక్షల రూపాయలు చెక్ అందించారాయన. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరలవుతున్నాయి. ఎస్కేఎన్ పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




