- Telugu News Photo Gallery Cinema photos Tolywood Actress Surekhavani Daughter Supritha Visits Srisailam Mallanna Temple, See Photos
Supritha: శ్రీశైలం మల్లన్న సేవలో సుప్రీత.. తల్లితో కలిసి ప్రత్యేక పూజలు.. ఫొటోస్ ఇదిగో
టాలీవుడ్ నటి సురేఖవాణి కూతురు సుప్రీత త్వరలో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. తాజాగా ఈ ముద్దుగుమ్మ శ్రీశైలం వెళ్లి భ్రమరాంబ మల్లిఖార్జునుడిని దర్శనం చేసుకుంది. అనంతరం తన ఆధ్యాత్మిక యాత్రకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
Updated on: Nov 19, 2025 | 10:30 PM

టాలీవుడ్ సీనియర్ నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. వందలాది సినిమాల్లో నటించి మెప్పించిన ఆమె ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా ఉంటోంది.

అయితే ఇప్పుడు సురేఖా వాణి కూతురు సుప్రిత నాయుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. ఇప్పటికే రెండు మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసిందీ స్టార్ కిడ్

ఇప్పటికే సోషల్ మీడియాలో ఎనలేని క్రేజ్ సొంతం చేసుకున్న సుప్రిత సిల్వర్ స్క్రీన్ పై ఎలా సత్తా చాటుతుందో చూడాలి.

సినిమాల సంగతి పక్కన పెడితే.. తాజాగాప్రముఖ జ్యోతిర్లింగమైన శ్రీశైలం మల్లన్న స్వామిని దర్శించుకుంది సుప్రీత. తల్లితో కలిసి అక్కడ ప్రత్యేక పూజలు చేసింది.

తన ఆధ్యాత్మిక యాత్రకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది సుప్రిత. ఇందులో చీరకట్టులో చాలా ట్రెడిషినల్ గా కనిపించిందీ స్టార్ కిడ్.




