OTT Movie: షూటింగ్ టైమ్‌లోనే ఐదుగురి మరణం.. ఓటీటీలో ముచ్చెమటలు పట్టించే తెలుగు హారర్ థ్రిల్లర్.
ఓటీటీలో హారర్ థ్రిల్లర్ సినిమాలకు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. భాషతో సంబంధం లేకుండా ఈ సినిమాలను చూసే వారు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా సరిగ్గా ఇదే హారర్ థ్రిల్లర్ జాబితాకు చెందుతుంది.

హారర్ థ్రిల్లర్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ముఖ్యంగా ఓటీటీలో ఈ జానర్ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది. అందుకే ఓటీటీల్లో ప్రతివారం వివిధ భాషలకు చెందిన హారర్ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వస్తుంటాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా హారర్ థ్రిల్లర్ జానర్ కు చెందినదే. ఈ సిరీస్ లో మొత్తం రెండు పార్ట్ లు వచ్చాయి. మొదటి భాగం డైరెక్టుగా ఓటీటీలో రిలీజ్ కాగా ఊహించని రెస్పాన్స్ వచ్చింది. దీంతో రెండో భాగాన్ని థియేటర్లలో రిలీజ్ చేశారు. దర్శక నిర్మాతల మాటలను నిజం చేస్తూ ఈ సినిమా ఆడియెన్స్ కు ముచ్చెమటలు పట్టించింది. ఒళ్లు గగుర్పొడిచే సీన్లు, భయంకరమైన ట్విస్టులు ఆడియెన్స్ ను ఉక్కిరి బిక్కిరి చేశాయి. చేతబుడులు, బాణామతి నేపథ్యంలో సాగే ఈ సినిమా థియేటర్లలో భారీ కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. జాస్తిపల్లి పోలీస్ స్టేషనుకు కొత్త ఎస్సై రవీంద్ర నాయక్ వస్తాడు. ‘ఓకే చితిలో రెండు శవాలు’ వార్త సంచలనం కావడంతో ఆ ఊరు, అక్కడి ప్రజల గురించి ఆయనకు బాగా అవగాహన ఉటుంది. అయితే ఇదే ఊరిలో జంగయ్య అనే కానిస్టుబుల్ ఉంటాడు. అతను ఒక కేసు వేసిఆ తర్వాత నుంచి కనిపించకుండా పోతాడు. అసలు జంగయ్య ఏమయ్యాడో అని ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అదే సమయంలో రవీంద్ర బలిజ ద్వారా కేరళలో కొమరయ్యను కలుసుకుంటాడు. అసలు కొమరయ్య ఎందుకు కేరళ వెళ్లాడు. జాస్తిపల్లి ఊరి పొలిమేరలో గుడితో పాటు కేరళలో అనంత పద్మనాభ స్వామి గుడికి… కొమరయ్య చేసే చేతబడి పూజలకు సంబంధం ఏమిటి? జంగయ్య ఏమయ్యాడు? చివరకు ఏమైంది? అన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే ఈ హారర్ థ్రిల్లర్ సినిమా పేరు మా ఊరిపొలిమేర 2. డాక్టర్ అనిల్ విశ్వనాథ్ తెరకెక్కించిన ఈ సినిమాలో సత్యం రాజేష్ (కొమురయ్య), జంగయ్య (బాలా దిత్య), బలిజ (గెటప్ శీను), కామాక్షి భాస్కర్ల, రాకెండ్ మౌళి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. వారితోపాటు సాహితి దాసరి, రవి వర్మ, చిత్రం శ్రీను, అక్షత శ్రీనివాస్ కూడా వివిధ పాత్రల్లో మెరిశారు. ప్రస్తుతం ఈ సినిమా ఆహా ఓటీటీలో అందుబాటులో ఉంది.
అయితే ఇటీవల ఓ సినిమా ఈవెంట్ కు హాజరైన మా ఊరిపొలిమేర 2 డైరెక్టర్ డాక్టర్ అనిల్ విశ్వనాథ్ ఒక ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. ఈ సినిమా షూటింగ్ టైమ్ లోనే ఐదుమంది చనిపోయారని తెలిపారు. చాలా మంది భయంతోనే వీరు చనిపోయారన అనుకున్నారని అయితే అందులో నిజం లేదని డైరెక్టర్ పేర్కొన్నారు. చనిపోయిన ఐదుగురు నెలల వ్యవధిలో చనిపోలేదని, ఏడాదిన్నర కాలంలో కరోనా రావడం యాక్సిడెంట్ వంటి కారణాలవల్ల చనిపోయారని తెలిపారు
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








