చిత్ర పరిశ్రమ బతకాలి అంటే ఆ విషయంలో తగ్గాల్సిందే..!
తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు.. అధిక డిజిటల్ ప్రొవైడర్ ధరలు, సినిమా టికెట్ రేట్ల పెరుగుదల, పైరసీకి వ్యతిరేకంగా హైదరాబాద్‌లో నవంబర్ 19న మహాధర్నా నిర్వహించారు. ఈ నిరసనలో ప్రముఖ నిర్మాత, ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధి అయిన ప్రితాని రామకృష్ణ గౌడ్‌తో సాయి వెంకట్, సిరాజ్ లాంటి పలువురు సినీ ప్రముఖులు, చిన్న సినిమా నిర్మాతలు, పంపిణీదారులు పాల్గొన్నారు. పరిశ్రమ మనుగడకు అత్యంత కీలకమైన చిన్న సినిమాలను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను ఈ ధర్నా చాటి చెప్పింది. రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఏటా సుమారు 250 సినిమాలు విడుదలవుతుంటే, అందులో దాదాపు 200 సినిమాలు చిన్న చిత్రాలేనని స్పష్టం చేశారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
