- Telugu News Photo Gallery Coffee with turmeric: How this golden drink can boost immunity, reduce inflammation and support overall health
Morning Coffee: కాఫీలో ఇది చిటికెడు కలిపితే.. కెఫిన్‌తో ఎలాంటి బాధ ఉండదిక!
చాలా మంది బరువు తగ్గడానికి కాఫీ తాగుతారు. కాఫీ తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు నయమవుతాయి. ముఖ్యంగా కాఫీ మన ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది. అందుకే చాలా మంది శీతాకాలంలో కాఫీ ఎక్కువగా తీసుకుంటారు. కానీ ఎక్కువ కెఫిన్ కొన్నిసార్లు శరీరంపై ప్రతికూల ప్రభావాన్ని..
Updated on: Nov 21, 2025 | 6:05 AM

చాలా మంది బరువు తగ్గడానికి కాఫీ తాగుతారు. కాఫీ తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు నయమవుతాయి. ముఖ్యంగా కాఫీ మన ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది. అందుకే చాలా మంది శీతాకాలంలో కాఫీ ఎక్కువగా తీసుకుంటారు.

కానీ ఎక్కువ కెఫిన్ కొన్నిసార్లు శరీరంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. కాఫీ తాగడం ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ మోతాదుకు మించి అధికంగా కాఫీ తాగకుండా ఉండటం ఎల్లప్పుడూ మంచిది.

కాఫీ వల్ల కలిగే చెడు ప్రభావాలను నివారించాలనుకుంటే సాధారణంగా ఓ చిట్కాని నిపుణులు సిఫార్సు చేస్తుంటారు. ఇది మీ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.

కాఫీలో పసుపు కలిపి తాగడం వల్ల చాలా మేలు జరుగుతుంది. దీని వల్ల కాఫీ ఎక్కువగా తాగినా ఎటువంటి చెడు ప్రభావాలు ఉండవు. కాఫీలో పసుపు కలిపి తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

కాఫీ, పసుపు కలిపి తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా ఖాళీ కడుపుతో కాఫీ తాగకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. మీరు కాఫీలో పసుపు కలిపి ఉదయం వేళల్లో ఖాళీ కడుపుతో తాగితే ఎలాంటి దుష్ర్ఫభావాలు ఉండవు. అది ఖచ్చితంగా ప్రయోజనకరంగా ఉంటుంది.




