మటన్ దాల్చా ఇలా చేశారంటే.. గిన్నె మొత్తం ఊడ్చేస్తారు
Prasanna Yadla
13 March 2026
Pic credit - Pixabay
నాన్ వెజ్ కూరల్లో ఇదే రారాజు. మటన్ తో ఎన్నో కూరలు చేస్తూ ఉంటాము. వాటిలో కొన్ని మాత్రమే రుచిగా ఉంటాయి
నాన్ వెజ్ కూరల్లో ఇదే రారాజు
మటన్ కూరల్లో దీనితో దాల్చా ఇలా చేశారంటే.. గిన్నెలు మొత్తం ఊడ్చేస్తారు. ఆపకుండా తింటారు.
మటన్ దాల్చా
అర కిలో మటన్, ఒక కప్పు శనగపప్పు , మూడు రకాల కూరగాయలు, రెండు పెద్ద ఉల్లిపాయలు, చిన్న టమోటాలు నాలుగు తీసుకోవాలి
కావలసిన పదార్థాలు
ఒక టేబుల్ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, ఒక కప్పు చింతపండు రసం, మసాలా పొడి, నూనె, నెయ్యి, యాలకులు, అర టీ స్పూన్ దాల్చిన చెక్క, నాలుగు కరివేపాకు తీసుకోవాలి.
కావాల్సిన పదార్థాలు
ముందుగా మటన్ బాగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత కుక్కర్ తీసుకుని ఆయిల్ వేసి, దానిలో కట్ చేసిన ఉల్లిపాయలు, అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి స్టవ్ మీదే ఉడికించాలి.
స్టెప్ - 1
మటన్ ముక్కలు బాగా ఉడికిన తర్వాత కట్ చేసిన టమోటా ముక్కలు వేసి 15 నిమిషాల పాటు వేయించాలి. ఆ తర్వాత నానబెట్టిన శనగపప్పును వేసి అలాగే ఉంచాలి.
స్టెప్ - 2
ఈ మిశ్రమంలో కూరగాయ వేసి అవి పచ్చి వాసన పోయే వరకు అలాగే పొయ్యి మీదే ఉంచాలి.
స్టెప్ - 3
చివర్లో చింతపండు రసం పోసి 5 మినిట్స్ ఉంచి కొత్తిమీర వేసి దించేయాలి. అంతే వేడి వేడి మటన్ దాల్చా రెడీ