Tollywood: ఒకప్పుడు స్టేట్ లెవెల్ టెన్నిస్ ప్లేయర్.. ఇప్పుడు టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో.. ప్రొడ్యూసర్ కూడా
'డాక్టర్ అవ్వాల్సింది అనుకోకుండా యాక్టర్స్ అయ్యాం' .. హీరో, హీరోయిన్ల నుంచి తరచూ వచ్చే మాట ఇది. అయితే ఈ టాలీవుడ్ హీరో మాత్రం టెన్నిస్ వదిలి పెట్టి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. టాలీవుడ్ లో క్రేజీ హీరోగా మారిపోయాడు. మంచి నిర్మాతగా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఈ హీరో విజయవాడలో పుట్టి పెరిగాడు. సినిమా నేపథ్యం ఉన్న కుటుంబమే. కానీ స్వయంకృషితో ఎదగాలనుకున్నాడు. అందుకే సినిమాల్లో నటించాలనే లక్ష్యంతో హైదరాబాద్ కు షిఫ్ట్ అయిపోయాడు. కానీ అంత ఈజీగా సినిమా అవకాశాలు రాలేదు. చాలా ఏళ్ల పాటు నిర్మాతల ఆఫీసులు చుట్టూ ఏళ్లు తిరిగితే కానీ నటుడిగా ఛాన్స్ దక్కించుకోలేకపోయాడు. మొదట కొన్ని చిన్న చిన్న సినిమాల్లో నటించాడు. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ మంచి నటుడిగా ప్రూవ్ చేసుకున్నాడు. ఆ తర్వాత సోలో హీరోగానూ మారిపోయాడు. ఎక్కువగా లవ్, రొమాంటిక్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ చేస్తూ యూత్ లో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సొంతంగా ఓ ప్రొడక్షన్ హౌస్ కూడా స్టార్ట్ చేశాడీ హీరో. అయితే సినిమాల్లోకి రాకముందు టెన్నిస్ క్రీడపై మక్కువ పెంచుకున్నాడీ టాలీవుడ్ క్రేజీ హీరో. స్టేట్ లెవెల్ టోర్నమెంట్లలో కూడా ఆడాడి సత్తా చాటాడు. అయితే ఎప్పుడైతే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాడో అప్పటి నుంచి టెన్నిస్ కి దూరమయ్యాడట. ఈ విషయాన్ని అతనే పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. ఇంతకీ ఆ హీరో ఎవరనుకుంటున్నారా? మన టాలీవుడ్ క్రేజీ హీరో నాగ శౌర్య.
బెంగళూరుకు చెందిన అనుషా శెట్టితో కలిసి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టాడు నాగ శౌర్య. 2022 నవంబర్ లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. గతేడాదే ఈ దంపతులకు ఒక పాప పుట్టింది. ఇక పెళ్లయ్యాక సినిమాలు బాగా తగ్గించేశాడు నాగ శౌర్య. 2023లో రంగభళి సినిమాలో చివరి సారిగా కనిపించాడీ క్రేజీ హీరో. ప్రస్తుతం పోలీస్ వారి హెచ్చరిక అనే సినిమా షూటింగ్ తో బిజీగా ఉంటున్నాడు. అలాగే బ్యాడ్ బాయ్ కార్తీక్, నారీ నారీ నడుమ మురారీ అనే సినిమాలను కూడా శౌర్య కంప్లీట్ చేయాల్సి ఉంది.
తల్లితో హీరో నాగ శౌర్య..
View this post on Instagram
కాగా నాగశౌర్య తల్లి ఉష ప్రొడక్షన్ కంపెనీతోపాటు రెస్టారెంట్ బిజినెస్ కూడా నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఆమెకు హైదరాబాద్ నగరంలో పలు రెస్టారెంట్లు ఉన్నాయి. ఇక నాగశౌర్య మేనత్త మరెవరో కాదు యమలీల, నెంబర్ వన్, ఆ ఒక్కటీ అడక్కు, జంపలకిడి పంబ.. వంటి హిట్ సినిమాల్లో నటించిన లత శ్రీ.
భార్యతో నాగ శౌర్య..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




