AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Srikanth: డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొంటోన్న ఈ టాలీవుడ్ హీరో గుర్తున్నాడా? ఆయన భార్య కూడా సినిమాల్లో బాగా ఫేమస్

‘రోజాపూలు’ సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు పొందారు శ్రీరామ్‌ అలియాస్ శ్రీకాంత్. ‘ఒకరికి ఒకరు’, ‘ఆడవారి మాటలకు అర్థాలు వేరులే’ తదితర సినిమాలతో తెలుగు ఆడియెన్స్ కు బాగా దగ్గరయ్యాడీ హ్యాండ్సమ్ హీరో. అయితే ఇటీవల అతను డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడం సంచలనమైంది.

Srikanth: డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొంటోన్న ఈ టాలీవుడ్ హీరో గుర్తున్నాడా? ఆయన భార్య కూడా సినిమాల్లో బాగా ఫేమస్
Actor Sriram Alias Srikanth
Basha Shek
|

Updated on: Nov 21, 2025 | 8:45 AM

Share

తెలుగుతో పాటు తమిళ భాషల్లో నటించిన శ్రీరామ్ అలియాస్ శ్రీకాంత్ ఈ మధ్యన డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడం చర్చనీయాంశమైంది. కొద్ది రోజులు రిమాండ్ ఖైదీగా జైలులో ఉన్న అతను ఇటీవలే బెయిల్ పై బయటకు వచ్చాడు. తెలుగబ్బాయి అయిన శ్రీకాంత్ రోజాపూలు సినిమాతో మొదటి సారిగా తెలుగు ఆడియెన్స్ ను పలకరించాడు. ఆ తర్వాత ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమాలో హీరో వెంకటేష్ స్నేహితుడిగా ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత పోలీస్ పోలీస్, దడ, నిప్పు, సుప్రీమ్, లై, శ్రీనివాస కళ్యాణం, సీత, రాగల 24 గంటల్లో, నమస్తే నేస్తమా వంటి చిత్రాల్లో హీరోగా, సహాయక నటుడిా మెప్పించాడు. తమిళంలో విజయ్ దళపతి హీరోగా నటించిన స్నేహితులు (త్రీ ఇడియట్స్) సినిమాలో శ్రీకాంత్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. అలాగే పిండం, హరికథ వెబ్ సిరీసులతో ఓటీటీ ఆడియెన్స్ కు బాగా చేరువయ్యాడీ హీరో. అయితే కొన్ని నెలల క్రితం డ్రగ్స్‌తో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు శ్రీకాంత్. కొద్ది రోజుల పాటు రిమాండ్ ఖైదీగా జైలు లో కూడా ఉన్నాడు. ఆ తర్వాత బెయిల్ పై బయటకు వచ్చాడు.

ఇదిలా ఉంటే సినిమాల సంగతి తప్పితే శ్రీకాంత్ వ్యక్తిగత జీవితం, ముఖ్యంగా అతని ఫ్యామిలీ గురించి చాలా మందికి తెలియదు. సినిమా ఫంక్షన్స్.. ప్రైవేట్ పార్టీలలోనూ శ్రీకాంత్ తన ఫ్యామిలీతో కనిపించిన సందర్భాలు చాలా తక్కువ. శ్రీకాంత్ 2008లో వందన అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. వీరికి కుమార్తె అహానా.. కుమారుడు ఆహిల్ ఉన్నారు. అయితే వందన కూడా సినిమా ఇండస్ట్రీలో బాగా ఫేమస్. భర్తతో కలిసి ‘గోల్డెన్ ఫ్రైడే ఫిల్మ్స్’ అనే ప్రొడక్షన్ బ్యానర్‌ను స్టార్ట్ చేసింది వందన. ‘నంబియార్’ అనే సినిమాను కూడా తీసింది. ఈ సినిమాకు వందన ప్రొడ్యూసర్‌గానే కాకుండా, శ్రీకాంత్ కు కాస్ట్యూమ్ డిజైనర్‌గా కూడా పని చేసింది. అలా ఇండస్ట్రీలో ఆమె కూడా భాగమై పోయింది. ఇక ఫ్యాషన్ షోలలో ఇద్దరూ కలిసి ర్యాంప్ వాక్ చేస్తూ కనిపించారీ లవ్లీ కపుల్.

ఇవి కూడా చదవండి

భార్య వందనతో శ్రీకాంత్..

ఇక వందన సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. స్వతహాగా ఫిట్‌నెస్ ఫ్రీక్ అయిన ఆమె, తన వర్కవుట్ వీడియోలతో పాటు, ఫ్యామిలీ వెకేషన్ ఫోటోలను షేర్ చేస్తుంటుంది. వీటికి నెటిజన్ల నుంచి కూడా మంచి స్పందన వస్తుంటుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.