Bigg Boss 9 Telugu : అమ్మ రాకతో మారిన గేమ్.. విన్నర్ రేసులోకి కళ్యాణ్ పడాల.. మాటిచ్చిన కామనర్..
బిగ్బాస్ సీజన్ 9.. మొదటి నుంచి కామనర్స్ వర్సెస్ సెలబ్రెటీస్.. చదరంగం కాదు.. రణరంగంగా సాగుతుంది. మొదటి నాలుగైదు వారాలు రెండు గ్రూపులుగా విడదీసి ఆడించిన బిగ్బాస్..ఆ తర్వాత సీన్ మారిపోయింది. ఇక ఇప్పుడు బిగ్బాస్ గ్రాండ్ ఫినాలే మరో మూడు నాలుగు వారాల సమయం మాత్రమే ఉంది.

కళ్యాణ్ పడాల.. బిగ్బాస్ సీజన్ 9లోకి కామనర్ కోటాలో ఎంట్రీ ఇచ్చాడు. ఈ షో కంటే ముందే అగ్నిపరీక్షలో తన ఆట తీరుతో జనాలకు దగ్గరైన కళ్యాణ్.. ఆ తర్వాత హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. మొదటి నాలుగైదు వారాలు తన ఆట తీరుతో నెగిటివిటీ మూటగట్టుకున్న కళ్యాణ్.. ఇప్పుడు అనుహ్యంగా విన్నర్ రేసులోకి వచ్చేశాడు. అయితే బిగ్బాస్ సీజన్ 9 అంటే తనూజ.. తనూజ అంటే బిగ్బాస్ సీజన్ 9 అన్నట్లుగా మారిపోయింది సీన్. మొదటినుంచి ఆమెకు బిగ్బాస్ ఎక్కువగా స్క్రీన్ స్పేస్ ఇవ్వడం.. ఆమె తప్పులను దాచేయడం.. ఆమెకు ఎదురుతిరిగితే ఇక అంతే అన్నట్లుగా ఉంది. మరోవైపు ముద్ద మందారం సీరియల్ ద్వారా ఎక్కువగా ఫ్యామిలీ అడియన్స్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. దీంతో బిగ్బాస్ సీజన్ 9 విన్నర్ తనూజ అని ఫిక్స్ అయిపోయారు అంతా.
కానీ ఇప్పుడు ఫ్యామిలీ వీక్ తర్వాత సీన్ మారేలా కనిపిస్తుంది. ప్రస్తుతం హౌస్ లో సుమన్ శెట్టి, సంజన, రీతూ చౌదరీ, దివ్య, భరణి, తనూజ, కళ్యాణ్ పడాల, ఇమ్మాన్యుయేల్, డీమాన్ పవన్ ఉన్నారు. వీరిలో తనూజ విన్నర్ కగా… రన్నరప్ కళ్యాణ్ లేదా ఇమ్మాన్యుయేల్ అయ్యే ఛాన్స్ ఉందని ముందు నుంచి వినిపిస్తున్న సమాచారం. అయితే ఇప్పుడు ఫ్యామిలీ వీక్ లో భాగంగా కళ్యాణ్ తల్లి లక్ష్మి హౌస్ లోకి అడుగుపెట్టిన తర్వాత అసలు గేమ్ మొదలైంది.
ఇవి కూడా చదవండి : Racha Movie : ఏంట్రా బాబూ ఈ అమ్మాయి.. హీరోయిన్లకు మించిన అందం.. రచ్చ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు గ్లామర్ సెన్సేషన్..
నిన్నటి ఎపిసోడ్ లో కళ్యాణ్ తల్లి లక్ష్మి ఎంట్రీ ఇచ్చింది. కొడుకు అంతగా హింట్స్ ఏమీ ఇవ్వలేదు. అలాగే ఎక్కువగా మాట్లాడుతూ అతి చేయలేదు. తక్కువగా మాట్లాడినప్పటికీ తన కొడుకును చేతుల్లోకి తీసుకుని మురిసిపోయింది. కప్పు పట్టుకుని వస్తానని ప్రామిస్ చేయ్ అని అడగ్గానే తల్లి చేతిలో చేయి వేసి ప్రామిస్ చేశాడు కళ్యాణ్. ఈ సీజన్ మొత్తంలో ఫ్యామిలీ వీక్ లో హైలెట్ అయ్యింది కళ్యాణ్ మదర్. పిచ్చోడా.. లోపల ఇంత పెట్టుకున్నావా.. ? అంటూ కొడుకుపై ప్రేమను కురిపించింది. చిన్నప్పటి నుంచి హాస్టల్ లో పెరిగిన కళ్యాణ్.. యాక్టింగ్ ఇష్టమైనప్పటికీ తండ్రి మాట కాదనలేక ఆర్మీకి వెళ్లాడు. అయినప్పటికీ తన ప్రయత్నాలు ఆపలేదు. చివరకు బిగ్ బాస్ షోలోకి అడుగుపెట్టాడు. ఇప్పుడు విన్నర్ రేసులో ఉన్నాడు. అయితే కళ్యాణ్ తల్లి కోరుకున్నట్టుగానే కప్పుకు అడుగు దూరంలోనే ఉన్నాడు. కానీ తనూజ కోసం తన గేమ్ కూడా వదిలేయడం.. తనూజకు ఎక్కువగా హైప్ ఇస్తూ తన ఆటను పట్టించుకోవడంతో నెటిజన్స్ సైతం అతడిపై సీరియస్ అవుతున్నారు. తన ఆట మీద దృష్టి పెట్టి.. గేమ్ లో స్ట్రాంగ్ గా ఉంటే.. కప్పు కొట్టేది కళ్యాణే అంటున్నారు ఫ్యాన్స్. ఈసారి విన్నర్ ఎవరు అవుతారో చూడాల్సిందే.
ఇవి కూడా చదవండి : Nayanthara : అతడితో నటించాలా.. ? వంద కోట్లు ఇచ్చినా ఆ హీరోతో సినిమా చేయను.. నయనతార..
