Bigg Boss Telugu 9: బిగ్‌బాస్ 11వ వారం ఓటింగ్ రిజల్ట్స్.. ఇక ఆ టాప్ కంటెస్టెంట్ బ్యాగ్ సర్దుకోవాల్సిందే!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 పదకొండో వారం ఎలిమినేషన్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం హౌస్ లో ఫ్యామిలీ వీక్ కొనసాగుతోంది. పెద్దగా ఫిజికల్ టాస్కులు కూడా జరగడం లేదు. కంటెస్టెంట్ల కుటుంబ సభ్యుల రాకతో హౌస్ మొత్తం ఎమోషనల్ గా మారిపోయింది.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 దాదాపు క్లైమాక్స్ కు చేరుకుంది. సెప్టెంబర్ 07న ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పటికే 11వ వారంలోకి అడుగు పెట్టింది. ఇంకో నాలుగు వారాల్లో ఈ సీజన్ కు కూడ ఎండ్ కార్డ్ పడనుంది. దీంతో అప్పుడే బిగ్ బాస్ విన్నర్, రన్నరప్, టాప్-5 కంటెస్టెంట్ల పై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే 11వ వారం ఎలిమినేషన్ పై సర్వత్రా ఆసక్తి కొనసాగుతోంది. ఎందుకంటే ఈ వారంలో పెద్దగా ఫిజికల్ టాస్కులు లేవు. ప్రస్తుతం హౌస్ లో ఫ్యామిలీ వీక్ కొనసాగుతోంది. వరుసగా ఫ్యామిలీ మెంబర్స్ ఎంట్రీ ఇస్తుండటంతో బీబీ హౌస్..ఎమోషన్స్‌కు కేరాఫ్‌గా మారింది. దీంతో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఉత్కంఠగా మారింది. 11 వ వారం నామినేషన్స్ లిస్ట్‌లో మొత్తం ఆరుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. కళ్యాణ్ పడాల, భరణి శంకర్, ఇమ్మాన్యుయేల్, డిమాన్ పవన్, సంజనా గల్రానీ, దివ్య నిఖితా డేంజర్ జోన్ లో నిలిచారు. వీరికి ఓటింగ్ ప్రక్రియ సోమవారం నుంచే ప్రారంభమంది. సోషల్ మీడియా పోల్స్, ఆన్‌లైన్ ఓటింగ్ ట్రెండ్స్ ప్రకారం.. మరోసారి కళ్యాణ్ పడాల నే అగ్రస్థానంలో దూసుకెళ్తున్నాడు.
ఈ సీజన్ లో మొదటి సారి నామినేషన్స్ లోకి వచ్చిన జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ రెండో స్థానంలో ఉన్నాడు. మొన్నటి వరకు ఓటింగ్ లో వెనకపడిన భరణి శంకర్ కు కూడా భారీగా ఓట్లు పడుతున్నాయి. ప్రస్తుతం అతను మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక డిమాన్ పవన్ నాలుగో ప్లేస్ లో, సంజనా గల్రానీ ఐదో పొజిషన్ లో నిలిచారు. దివ్య నిఖితా ఆఖరి స్థానంలో కొనసాగుతోంది. అంటే ప్రస్తుతం సంజనా, దివ్య ఎలిమినేషన్ కు దగ్గరగా ఉన్నారన్నమాట. అయితే బిగ్ బాస్ ఓటింగ్ కు ఇంకా 24 గంటలకు పైగా సమయం ఉంది. శుక్రవారం (నవంబర్ 21) అర్ధరాత్రితో ఈ ఓటింగ్ ప్రక్రియ ముగియ నుంది. మరి అప్పటి లోపు ఈ ఓటింగ్ లో ఏమైనా మార్పులు వస్తాయేమో చూడాలి. అయితే ఇప్పుడు ముఖ్యంగా దివ్యకు పరిస్థితులన్నీ ప్రతి కూలంగా ఉన్నాయి. కాబట్టి ఈ వారం ఆమెనే ఎలిమినేట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
బి గ్ బాస్ లేటెస్ట్ ప్రోమో..
Hidden moments, high drama! Catch it on Bigg Boss Unseen! 👁️✨
Watch #BiggBossTelugu9 UnSeen Extra Cuts Mon–Fri 10:30 PM, on #StarMaa pic.twitter.com/Jl24iOgTgj
— Starmaa (@StarMaa) November 20, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








