AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Telugu 9: అప్పుడేమో రావొద్దని.. ఇప్పుడేమో చిన్న పిల్లాడిలా..అమ్మకిచ్చిన మాటను కల్యాణ్ నెరవేరుస్తాడా?

కొన్ని రోజుల ముందు బిగ్ బాస్ హౌస్ లో కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. తన తల్లిదండ్రులను చూడాలనుకోవడం లేదని, కావాలంటే ఆ అవకాశం మరొకరికి ఇప్పించాలన్నాడు కల్యాణ్. అయితే ఇప్పుడు తల్లిని చూడగానే ఒక్కసారిగా చిన్ని పిల్లాడిలా మారిపోయాడీ టాప్ కంటెస్టెంట్.

Bigg Boss Telugu 9: అప్పుడేమో రావొద్దని.. ఇప్పుడేమో చిన్న పిల్లాడిలా..అమ్మకిచ్చిన మాటను కల్యాణ్ నెరవేరుస్తాడా?
Bigg Boss Telugu 9
Basha Shek
|

Updated on: Nov 20, 2025 | 7:21 PM

Share

ప్రస్తుతం తెలుగు బిగ్ బాస్ హౌస్ లో ఫ్యామిలీ వీక్ నడుస్తోంది. కంటెస్టెంట్ల కుటుంబ సభ్యులు ఒక్కొక్కరు హౌస్ లోకి వస్తున్నారు. చాలా రోజుల నుంచి హౌస్ లో ఉంటోన్న తమ వారికి ధైర్యం చెబుతున్నారు. ఇంకా బాగా ఆడాలని సూచిస్తున్నారు. ఎలాగైనా బిగ్ బాస్ కప్పుతో ఇంటికి తిరిగి రావాలని కంటెస్టెంట్స్ తో చెబుతున్నారు. ఇప్పటికే తనూజ, సంజన, భరణి, డిమాన్ పవన్, రీతూ చౌదరి, సుమన్ శెట్టి.. ఇలా పలువురి కంటెస్టెంట్ల కుటుంబ సభ్యులు బిగ్ బాస్ హౌస్ లో సందడి చేశారు. తాజాగా ఈ సీజన్ లో టాప్ కంటెస్టెంట్ గా దూసుకుపోతోన్న పవన్ కల్యాణ్ పడాల ఫ్యామిలీ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చింది. కాగా కొన్ని రోజుల ముందు తన తల్లిదండ్రుల గురించి కల్యాణ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు అతనిపై నెగెటివిటీని తెచ్చిపెట్టాయి. తాను అమ్మానాన్న సావాసాన్ని మిస్‌ అయ్యానని ఏడ్చిన కల్యాణ్.. ఫ్యామిలీ వీక్ లో ఎవరినీ హౌస్ లోకి రానీయవద్దన్నాడు. కావాలంటే ఎవరికోసమైనా త్యాగం చేయడానికైనా రెడీ అంటూ కొంచెం పరుషంగా మాట్లాడాడు.

అయితే ఫ్యామిలీ వీక్ లో భాగంగా ఇప్పుడు కల్యాణ్ తల్లి బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చింది. అప్పుడు రావొద్దని చెప్పిన ఈ కంటెస్టెంట్ ఇప్పుడు తీరా కళ్ల ముందు తల్లి కనిపించేసరికి చంటిపిల్లాడిలా మారిపోయాడు. అమ్మ కొంగు పట్టుకుని కన్నీరుమున్నీరైపోయాడు. ఈ సందర్భంగా కొడుక్కి ధైర్యం చెప్పిన ఆమె ‘మనసులో ఇంత బాధ పెట్టుకున్నావేంట్రా? ధైర్యంగా ఉండు.. బిగ్ బాస్ కప్పు తీసుకుని ఇంటికి రావాలి ‘ అని మాట తీసుకుంది. అందుకు కల్యాణ్‌ తప్పకుండా నీ కోరిక నెరవేరుస్తానంటూ ఆమె చేతిలో చేయేసి మాటిచ్చాడు. మొత్తానికి కంటెస్టెంట్ల ఫ్యామిలీ మెంబర్స్ రాకతో ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ మొత్తం ఎమోషనల్ గా మారిపోయింది.

ఇవి కూడా చదవండి

బిగ్ బాస్ హౌస్ లో పవన్ కల్యాణ్ పడాల తల్లి.. ఎమోషనల్ వీడియో..

కాగా చిన్న పల్లెటూరు నుంచి ఆర్మీకి… అక్కడ బ్రేక్‌ ఇచ్చి బిగ్‌బాస్‌ హౌస్‌కి వచ్చాడు పవన్ కల్యాణ్ పడాల. తనదైన ఆట, మాట తీరుతో బిగ్ బాస్ టైటిల్ విన్నర్ రేసులో నిలిచాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
భారత రైల్వే నె‌ట్‌వర్క్ అభివృద్ధిపై కేంద్రం ఫోకస్..
భారత రైల్వే నె‌ట్‌వర్క్ అభివృద్ధిపై కేంద్రం ఫోకస్..
దేశంలో ఉద్యోగ కల్పన, నిరుద్యోగంపై ఫ్యాక్ట్ చెక్‌లో కీలక విషయాలు
దేశంలో ఉద్యోగ కల్పన, నిరుద్యోగంపై ఫ్యాక్ట్ చెక్‌లో కీలక విషయాలు
చికెన్ తిన్న తర్వాత పొరపాటున కూడా ఈ ఆహారాలు ముట్టొద్దు..
చికెన్ తిన్న తర్వాత పొరపాటున కూడా ఈ ఆహారాలు ముట్టొద్దు..
మిగిలింది ఇంకా రెండే నెలలు..60 ఏళ్ల క్రితమే రాసిపెట్టిన మరణ శాసనం
మిగిలింది ఇంకా రెండే నెలలు..60 ఏళ్ల క్రితమే రాసిపెట్టిన మరణ శాసనం
పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఈ ఒక్క పని చేస్తే భారీగా నష్టపోతారు
పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఈ ఒక్క పని చేస్తే భారీగా నష్టపోతారు
చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు.. అమ్మాయి విషయంలో గొడవ పడ్డారు
చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు.. అమ్మాయి విషయంలో గొడవ పడ్డారు
కంగనా–కృతి వార్‌.. ఫైట్‌నా? ఫ్రీ పబ్లిసిటీనా?
కంగనా–కృతి వార్‌.. ఫైట్‌నా? ఫ్రీ పబ్లిసిటీనా?
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా ఆర్సీబీ ఆణిముత్యం..!
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా ఆర్సీబీ ఆణిముత్యం..!
కాంటాక్ట్‌ లెన్స్‌తో ఈత కొడితే.. కంటిని తినేసిన పరాన్నజీవి!
కాంటాక్ట్‌ లెన్స్‌తో ఈత కొడితే.. కంటిని తినేసిన పరాన్నజీవి!
జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమోలో ఆ ఇద్దరు మిస్సింగ్.. బిగ్‌బాస్ కోసమే!
జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమోలో ఆ ఇద్దరు మిస్సింగ్.. బిగ్‌బాస్ కోసమే!