ఎంత పనిచేశావ్ అమ్మడు.. ఉప్పెన మూవీ మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరంటే..
Rajitha Chanti
Pic credit - Instagram
01 April 2026
మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమైన సినిమా ఉప్పెన. డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వం వహించిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.
దర్శకుడికి, హీరోకి ఇదే తొలి డెబ్యూ మూవీ కాగా.. అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టికి ఇదే ఫస్ట్ తెలుగు సినిమా. అలాగే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది.
ఈ సినిమాలో విజయ్ సేతుపతి విలన్ పాత్రలో మెప్పించారు. అలాగే దేవి శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ మరో హైలెట్ అయ్యింది. ఈ మూవీ భారీ విజయాన్ని సాధించింది.
2021 ఫిబ్రవరి 12న రిలీజైన ఈ సినిమా సంచలనం సృష్టించింది. ఈ సినిమాతో కుర్రకారు గుండెలను కొల్లగొట్టి ఒక్కసారిగా తెలుగులో సెన్సేషన్ అయ్యింది హీరోయిన్ కృతి శెట్టి.
ఈ సినిమాతో కృతి శెట్టి రాత్రికి రాత్రే స్టార్ అయిపోయింది. నిజానికి ఈ సినిమాకు కృతి ఫస్ట్ ఛాయిస్ కాదు. ముందుగా ఈ చిత్రానికి మరో అమ్మాయిని అనుకున్నారట.
ఆమె మరెవరో కాదు.. హీరో రాజశేఖర్ కుమార్తె శివానీ. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ఉప్పెన సినిమాకు ముందుగా తనను సంప్రదించారని చెప్పుకొచ్చింది.
కానీ తనకు చెప్పినప్పుడు ఎక్కువగా బోల్డ్ సీన్స్ ఉన్నాయని.. తాను కంఫర్ట్ గా ఫీలవ్వలేనని.. ఆ సినిమాను అందరితో కలిసి చూడలేనని అనిపించి రిజెక్ట్ చేశానని తెలిపింది.
తనకు ముందు చెప్పిన స్టోరీలా కాకుండా కొన్ని సన్నివేశాలు, కథ మార్చి ఉప్పెన చిత్రాన్ని తెరకెక్కించారని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం శివానీ విభిన్న కథలతో ఆకట్టుకుంది.