అమరావతికి మాత్రమే క్యాపిటల్ ట్యాగ్‌లైన్! దేశంలో ఏ రాజధానికి లేని రికగ్నైజేషన్
ఇప్పటిదాకా అమరావతి అంటే.. కేవలం ఒక 'ప్రభుత్వ జీవో' మాత్రమే. ప్రభుత్వం మారితే.. జీవో కూడా మారుతుంది. కానీ ఇప్పుడు జరిగింది అది కాదు! సాక్షాత్తూ దేశ పార్లమెంట్ రాజ్యాంగబద్ధంగా విభజన చట్టాన్ని సవరించి 'అమరావతి' అనే పేరును రికార్డుల్లోకి ఎక్కించింది. కేంద్రం గుర్తించిన రాజ్యాంగబద్ధ నగరంగా మారింది. ఇది అమరావతికి మాత్రమే లభించిన 'లైఫ్ టైమ్ వారంటీ'. 'రాజధాని ఇక్కడే ఉంటుందా? లేదా?' అనే సందిగ్ధతకు ఈ చట్టబద్ధత ఒక పర్మనెంట్ ఫుల్‌స్టాప్. ఇది కేవలం కాగితం మీద పేరు మార్పు కాదు, అమరావతి చుట్టూ ఒక అభేద్యమైన రక్షణ కవచం. ఈ సవరణతో అమరావతి నిర్ణయాధికారం రాష్ట్ర పరిధి నుంచి కేంద్ర చట్టం పరిధిలోకి వెళ్లింది. రేపు ఏ ప్రభుత్వం వచ్చినా, ఒక అసెంబ్లీ తీర్మానంతో రాజధానిని మార్చడం అసాధ్యం! అది మారాలంటే మళ్లీ దేశ పార్లమెంటే ఆమోదించాలి. ఇది అమరావతికి వేసిన 'పర్మనెంట్ లాక్'! అందుకే, అమరావతి ఇప్పుడు కేవలం ఏపీ రాజధాని మాత్రమే కాదు.. కేంద్ర గెజిట్‌లో నమోదైన 'అజేయమైన నగరం'. భూములిచ్చిన రైతులతో జరిగిన ఒప్పందాలకు ఈ సవరణ ఒక సావరీన్ గ్యారెంటీగా నిలుస్తుంది. న్యాయపరమైన చిక్కులన్నింటికీ ఈ ఒక్క గెజిట్ నోటిఫికేషన్ శాశ్వత ముగింపు పలికినట్టైంది. అసలు రాజధానికి ఈ చట్టబద్ధత ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఆ సవరణ వెనుక ఉన్న అసలు కారణాలేంటి? 'ఈ తరహా బిల్లుకు వ్యతిరేకం' అని వైసీపీ ఎందుకు వాకౌట్ చేసింది?

అసలు అమరావతికి చట్టబద్ధత ఎందుకు? వైసీపీ అడుగుతున్నది ఇదే. సామాన్యుడి ప్రశ్న కూడా. ఇందుకోసం.. పార్లమెంట్‌లో ఏకంగా చట్ట సవరణ చేయాల్సిన అవసరమేంటి అనేది కూడా మెదళ్లలో నానుతున్న ప్రశ్నే. హైదరాబాద్ పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది.. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు ఒక ‘కొత్త రాజధాని’ ఉండాలి అని.. 2014 విభజన చట్టంలో రాసి ఉంది. అందులో ‘అమరావతి’ అనే పేరు లేదు. సో, ఆ పునర్విభజన చట్టంలో ఖాళీగా ఉన్న ఆ చోటును ‘అమరావతి’ అనే పేరుతో భర్తీ చేశారు. దీంతో అమరావతికి రాజ్యాంగబద్ధ చిరునామా దొరికింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3&4 ప్రకారం కొత్త రాష్ట్రాల ఏర్పాటు లేదా మార్పులు చేసే అధికారం పార్లమెంటుకు ఉంటుంది. 2014 విభజన చట్టం ఈ ఆర్టికల్స్ కిందనే రూపొందించారు. ఆ తరువాత వచ్చే.. సెక్షన్-5ని సవరించడం ద్వారా, అమరావతిని రాజధానిగా గుర్తించే అంశం నేరుగా పార్లమెంటరీ చట్టం పరిధిలోకి వస్తుంది. దీనివల్ల రాష్ట్ర అసెంబ్లీలు భవిష్యత్తులో చేసే తీర్మానాల కంటే ఈ కేంద్ర చట్టానికే ఎక్కువ విలువ ఉంటుంది. గతంలో ‘మూడు రాజధానుల’ వ్యవహారం హైకోర్టులో ఉన్నప్పుడు, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఒక అఫిడవిట్ దాఖలు చేసింది. ఒక రాష్ట్రానికి రాజధాని ఎక్కడ ఉండాలి, ఎన్ని రాజధానులు ఉండాలి అనేది పూర్తిగా ఆ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాధికారం. ఇందులో కేంద్రం జోక్యం చేసుకోదు అని అని అఫిడవిట్‌లో చెప్పింది. విభజన చట్టంలోని...
