Telangana: సరుకులు కావాలని షాప్‌కు వచ్చాడు.. ఫోన్‌పేలో డబ్బులు కొట్టాడు.. కట్‌చేస్తే.
పెరుగుతున్న టెక్నాలజీని ఉపయోగించి కొందరు అద్భుతాలు సృష్టిస్తుంటే అదే టెక్నాలజీని వాడి కొందరు కేటుగాళ్లు నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఖమ్మం జిల్లాలో వెలుగు చూసింది. ఫేక్ ఫోన్‌పే యాప్‌ను ఉపయోగించి ఓ కిరాణా షాపు వ్యాపారికి రూ.5వేల కుచ్చుటోపి పెట్టారు. బాధితుడి ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

నకిలీ ఫోన్‌పే మెసేజ్‌తో ఇద్దరు యువకులు ఓ కిరాణా షాపు యజమానికి మోసం చేసిన ఘటన భద్రాచలం పట్టణంలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. భద్రాచలం పట్టణంలోని పాత మార్కెట్లో ఉన్న కొణిజెర్ల రమేష్ కిరాణం అండ్ జనరల్ స్టోర్స్ లో నిత్యావసరాల కోసం ద్విచక్ర వాహనంపై ఇద్దరు యువకులు వచ్చారు. ఇద్దరు యువకులు కలిసి సుమారు రూ.5వేల విలువైన సామాగ్రి కొన్నారు. అయితే ఫేక్ పోన్‌పే యాప్‌ను ఉపయోగించి రూ.5వేలు చెల్లించినట్టు నలికీ మెసేజ్‌ను చూపించారు. ఆ తర్వాత మెళ్లగా అక్కిడి నుంచి జారుకున్నారు.
అయితే ఎంతసేపటికి వారు పంపిన రూ.5వేల వ్యాపారి అకౌంట్లోకి రాకపోవడంతో మోసపోయానని గ్రహించిన సదురు షాపు యజమానికి వెంటనే అలర్ట్ అయ్యాడు. హుటాహుటీన సమీపంలోని భద్రాచలం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తనకు జరిగిన మోసాన్ని పోలీసులకు వివరించాడు. ఇక బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించి మోసగాళ్లను పట్టుకునేందుకు ముమ్మరంగా గాలిస్తున్నారు. సీసీ కెమెరాలో ఇద్దరు కేటుగాళ్లు బైక్ పై వచ్చినట్లు దృశ్యాలు రికార్డు అయ్యాయి. ఆ బైక్ రిజిస్టర్ నెంబర్ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
