AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫిలిం ఛాంబర్‌లో వాడివేడి చర్చ

ఫిలిం ఛాంబర్‌లో వాడివేడి చర్చ

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: May 17, 2026 | 12:55 PM

Share

టాలీవుడ్‌లో పర్సెంటేజ్ విధానంపై నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య తీవ్ర వివాదం చెలరేగింది. డి. సురేష్ బాబు ఆధ్వర్యంలో జరిగిన ఫిలిం చాంబర్ సమావేశంలో వాడివేడి చర్చ జరిగింది. మొదటి వారంలో రెంటల్ విధానం బదులు షేరింగ్ కోరుకుంటున్నారు ఎగ్జిబిటర్లు. ఈ సమస్య పరిష్కారానికి కాలపరిమితితో కూడిన కమిటీ ఏర్పాటుపై చర్చలు జరుగుతున్నాయి.

టాలీవుడ్ పర్సెంటేజ్ విధానంపై ప్రస్తుతం తెలుగు ఫిలిం చాంబర్‌లో వాడివేడి చర్చ జరుగుతోంది. డి. సురేష్ బాబు అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి అగ్ర నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు హాజరయ్యారు. రెవెన్యూ షేరింగ్‌కు సంబంధించి “పర్సెంటేజ్ విధానం”పై ఇరు వర్గాలు తమ వాదనలను వినిపిస్తున్నాయి. సమావేశం ప్రారంభంలో నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. సునీల్ నారంగ్, నాగవంశీ వంటి ప్రముఖుల మధ్య వ్యక్తిగత దూషణలు కూడా జరిగినట్టు సమాచారం. దిల్‌రాజు, అల్లు అరవింద్, చెదలవాడ శ్రీనివాసరావు వంటి పెద్దలు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ వివాదానికి పరిష్కారంగా పర్సెంటేజ్ విధానంపై ఒక కమిటీని ఏర్పాటు చేయాలని, ఆ కమిటీకి నిర్దిష్ట కాలపరిమితి విధించాలని సమావేశంలో ప్రధానంగా చర్చ జరుగుతోంది.

Follow Us