AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు.. రుతుపవనాలు వచ్చేస్తున్నాయ్!

తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు.. రుతుపవనాలు వచ్చేస్తున్నాయ్!

Samatha J
|

Updated on: May 17, 2026 | 1:15 PM

Share

తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం కొనసాగుతోంది.. బుధవారం వరకు ఎండలు దంచికొట్టగా.. గురువారం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. బుధవారం తన ప్రతాపం చూపించిన భానుడు గురువారం కాస్త చల్లబడ్డాడు. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అత్యధిక ప్రాంతాలలో ఆకాశాం మేఘావృతమమైంది. మధ్యాహ్నం కొద్దిగా టెంపరేచర్ పెరిగినప్పటికీ ఆ తర్వాత మాత్రం చల్లగాలులు వీచాయి. ఈ అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.

తెలంగాణలో కొన్ని జిల్లాల్లో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతోంది. ఉదయం 8గంటల నుంచే ఎండ, ఉక్కపోత మొదలు కావడంతో మధ్యాహ్నానికే రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది. వచ్చే మూడు రోజులు ఉత్తర తెలంగాణలో భానుడి ప్రతాపం తీవ్రరూపం దాల్చనున్నట్టు హెచ్చరించింది. దాహం వేయకపోయినా తరచూ నీళ్లు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ వంటివి తీసుకోవాలని సూచిస్తున్నారు. వేపుళ్లు, మసాలా పదార్థాలకు దూరంగా ఉండి, తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. గర్భిణులు, వృద్ధులు, చిన్నపిల్లలు మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.మండిపోతున్న ఎండల నేపథ్యంలో ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్‌ అలర్జ్‌ ప్రకటించింది. రాష్ట్రంలోని మిగతా జిల్లాలకు ఆరెంజ్‌ అలర్జ్‌ జారీ చేసినట్టు తెలిపింది. ముఖ్యంగా ఈనెల 16,17,18 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా వడగాలులు తీవ్రస్థాయిలో వీచే అవకాశాలు ఉన్నాయని వివరించింది. గురువారం ఆదిలాబాద్‌ జిల్లాల్లో 44.7 డిగ్రీలు, జగిత్యాలలో 44.6, నిర్మల్‌లో 44.6, పెద్దపల్లిలో 44.6, నిజామాబాద్‌లో 44.5, కామారెడ్డిలో 44.2, సిద్దిపేటలో 44.2 డిగ్రీలు నమోదు కాగా, హైదరాబాద్‌ సహా మిగిలిన జిల్లాల్లో 42 డిగ్రీలపైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్టు తెలిపింది. పెరిగిన ఎండల తీవ్రత పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.గురువారం అదిలాబాద్ జిల్లా తాంసి మండలంలో అత్యధికంగా 45.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో కూడా 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో జనం బయటకు రావాలంటేనే జంకుతున్నారు. శనివారం అదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో వడగాల్పులు వీస్తాయని, ఆది, సోమ వారాల్లో పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, నిజామాబాద్ జిల్లాలకు కూడా వడగాలులు విస్తరిస్తాయని అధికారులు తెలిపారు. వడగా

మరిన్ని వీడియోల కోసం :

రిజల్ట్‌తో సంబంధమే లేదు.. బ్రేక్‌ కావాలంటున్న స్టార్స్‌!

భారీ బడ్జెట్ సినిమాలకు ఆర్థిక ఇబ్బందులు

ట్రెండింగ్ బ్యూటీ హెల్ప్ తీసుకుంటున్న చియాన్‌ విక్రమ్‌

డైలాగ్ వార్ : ఇండస్ట్రీ ఇగోస్

ఫిలిం ఛాంబర్‌లో వాడివేడి చర్చ

Follow Us