AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రిజల్ట్‌తో సంబంధమే లేదు.. బ్రేక్‌ కావాలంటున్న స్టార్స్‌!

రిజల్ట్‌తో సంబంధమే లేదు.. బ్రేక్‌ కావాలంటున్న స్టార్స్‌!

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: May 17, 2026 | 12:39 PM

Share

విజయం, అపజయం ఏదైనా, స్టార్స్ కెరీర్‌లో బ్రేక్‌లు తీసుకుంటున్నారు. స్లోగా, పక్కా ప్లానింగ్‌తో తర్వాతి ప్రాజెక్టులను సిద్ధం చేస్తున్నారు. యష్, చియాన్ విక్రమ్, అజిత్, బాద్‌షా, అమీర్ ఖాన్ వంటి అగ్ర తారలు దీర్ఘకాలిక విరామాలతో ప్రేక్షకుల్లో అంచనాలను పెంచుతున్నారు. గ్యాప్ వచ్చినా పర్లేదు, హిట్ మాత్రం కొట్టాల్సిందే అన్నదే వారి వ్యూహం.

సినిమా రంగంలో విజయం, అపజయం ఈ రెండింటినీ హ్యాండిల్ చేయడం చాలా కష్టమైన పని. అందుకే మన అగ్ర తారలు, బ్లాక్‌బస్టర్ హిట్ అయినా లేదా భారీ డిజాస్టర్ ఎదురైనా కెరీర్‌లో కాస్త విరామం తీసుకుంటున్నారు. స్లో అండ్ స్టడీగా తమ తదుపరి ప్రాజెక్ట్‌లను ప్లాన్ చేసుకుంటున్నారు. గ్యాప్ వచ్చినా పర్లేదు, హిట్ మాత్రం కొట్టాల్సిందే అన్న కసితో ప్రాజెక్టులను సిద్ధం చేస్తున్నారు. ఈ వ్యూహం ప్రేక్షకుల్లో అంచనాలను పెంచడంలో విజయవంతమవుతోంది. కేజీఎఫ్ 2 వంటి భారీ బ్లాక్‌ బస్టర్‌తో ఇండియన్ బాక్స్ ఆఫీస్‌ను షేక్ చేసిన యష్ తన తర్వాతి సినిమాను మొదలుపెట్టడానికి చాలా సమయం తీసుకున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత టాక్సిక్ సినిమాను ప్రారంభించిన ఆయన, ఆ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నాలుగేళ్లకు పైగా సమయం తీసుకుంటున్నారు. ఇదే పంథాను ప్రముఖ నటులు చియాన్ విక్రమ్, అజిత్, బాద్‌షా (షారుఖ్ ఖాన్) కూడా అనుసరిస్తున్నారు. వరుస వైఫల్యాల తర్వాత విక్రమ్, కొత్త సినిమా కోసం విరామం తీసుకున్నారు. అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ తర్వాత ఏడాది గడిచినా, కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించలేదు. బాలీవుడ్‌లో బాద్‌షా రెండేళ్ల గ్యాప్‌తో కింగ్ సినిమాను సిద్ధం చేస్తుండగా, అమీర్ ఖాన్ కూడా ఇదే తరహాలో తన ప్రాజెక్ట్‌లను హోల్డ్‌లో పెట్టారు. ఇలా బ్రేక్ తర్వాత వస్తున్న ఈ స్టార్స్ అంచనాలు పెంచడంలో సూపర్ సక్సెస్ అవుతున్నారు.

Published on: May 17, 2026 12:35 PM
Follow Us