టాలివుడ్ లక్కీ హీరోయిన్ గా మారిపోయిన మీనాక్షి చౌదరి

Rajeev 

16 May  2026

instagram

మీనాక్షి చౌదరి. సుశాంత్​ ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ మూవీతో టాలీవుడ్‌ను పలకరించిన ఈ ముద్దుగుమ్మ..

ఆ తర్వాత మాస్ మహారాజా రవితేజ హీరోగా చేసిన ‘ఖిలాడీ’లో నటించి మెప్పించింది. మాస్ పాటకు స్టెప్పులేసి అదరహో అనిపించింది.

హాట్ హాట్ అందాలతో కుర్రాళ్లను గిలిగింతలు పెట్టింది. ఆ తర్వాత అడివి శేష్ సరసన ‘హిట్-2’లో చేసింది.

కెరీర్ బిగినింగ్ లో కాస్త స్లోగా సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతుంది.

కెరీర్ స్టార్టింగ్ లోనే సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో నటించే అవకాశం అందుకుంది. మహేష్ బాబు నటించిన గుంటూరు కారంలో నటించి మెప్పించింది.

ఇవి కాక విశ్వక్ సేన్, వరుణ్ తేజ్, దుల్కర్ సల్మాన్ హీరోలుగా నటిస్తున్న సినిమాల్లో నటించి మెప్పించింది. రీసెంట్ అనగనగా ఓ రాజు సినిమాతో హిట్ అందుకుంది.

తెలుగు తమిళ్ లో అవకాశాలు అందుకుంటుంది ఈ వయ్యారి భామ. ఇటీవలే కొన్ని తెలుగు సినిమాలను ఓకే చేసింది.