అది అప్పుడెప్పుడో జరిగింది ఇప్పుడెందుకు.. వివాదం పై క్లారిటీ ఇచ్చిన సాయి పల్లవి 

Rajeev 

23 April 2026

instagram

స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది అందాల భామ సాయి పల్లవి తెలుగుతో పాటు తమిళ్ లోనూ వరుస సినిమాలతో బిజీగా ఉంది ఆమె.

తెలుగులో సాయి పల్లవి స్టార్ డమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లేడీ పవర్ స్టార్ గా క్రేజ్ తెచ్చుకుంది. 

ఇటీవల తన సినిమాల కంటే ఇతర విషయాలతో వార్తల్లో నిలుస్తోందీ అందాల తార. సినిమాల్లో అయినా, బయటైనా సాయి పల్లవికి మంచి ఇమేజ్ ఉంది.

ప్రస్తుతం బాలీవుడ్ లో తెరకెక్కుతున్న రామాయణం సినిమాలో సీతగా నటిస్తుంది సాయి పల్లవి. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. 

 సాయి పల్లవి రెండేళ్ల క్రితం ఒక ఇంటర్వ్యూలో మీరు మలయాళి కదా తెలుగులో ఎలా మాట్లాడగలుగుతున్నారు అనే ప్రశ్నకు తాను మలయాళీ కాదు తమిళమ్మాయి అని చెప్పింది. 

దాని పై ఇప్పుడు కొంతమంది సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు. దాంతో దీని పై సాయి పల్లవి స్పందించింది. 

అలాంటి ప్రచారం తనను చాలా బాధించిందని పల్లవి తెలిపింది. తాను తమిళ అమ్మాయిని, తన పూర్వీకులు తమిళం అని మాత్రమే చెప్పానని క్లారిటీ ఇచ్చింది సాయి పల్లవి.