సైలెంట్ అయిపోయిన కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి 

Rajeev 

22 April 2026

instagram

కేజీఎఫ్ సినిమాతో  ఒక్కసారిగా పాపులర్ అయ్యింది ముద్దుగుమ్మ శ్రీనిధి శెట్టి. సినిమా ఎంత పెద్ద గురు అయ్యింది ఈ భామకు అంతే క్రేజ్ వచ్చింది. 

తొలి సినిమాతోనే సంచలన విజయాన్ని అందుకున్న శ్రీనిధికి ఆఫర్స్ క్యూ కట్టాయి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది. 

కేజీఎఫ్ తర్వాత వచ్చిన కేజీఎఫ్ 2 సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంది. దాంతో ఈ భామ ఓవర్ నైట్ స్టార్ గా ఎదిగింది. 

ఆతర్వాత తమిళ్ లో కోబ్రా అనే సినిమా చేసింది. కానీ ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఆతర్వాత చిన్న గ్యాప్ తీసుకొని తెలుగులో సినిమాలు చేసింది. 

నాని హీరోగా నటించిన హిట్ 3 సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఈ సినిమా భారీ హిట్ గా నిలిచింది. దాంతో టాలీవుడ్లో తొలి విజయాన్ని అందుకుంది. 

ఆతర్వాత సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన తెలుసు కదా అనే సినిమా చేసింది. ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. 

ఈ సినిమా తర్వాతమారో సినిమా అనౌన్స్ చేయలేదు శ్రీనిధి.. సోషల్ మీడియాతోనే ఈ అమ్మడు గడిపేస్తుంది.