అనుపమ పరమేశ్వరన్  రేస్ లో వెనకబడుతుందా.? 

Rajeev 

22 April 2026

instagram

అనుపమ పరమేశ్వరన్.. మనదగ్గర అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్లలో ఆమె ఒకరు. ఇప్పుడు ఈ అమ్మడు కుర్రాళ్ల ఆరాధ్య దేవత.

ప్రేమమ్ సినిమాతో టీనేజ్ లోనే సినీప్రయాణం స్టార్ట్ చేసిన ఈ వయ్యారి.. అఆ, శతమానం భవతి సినిమాలతో తెలుగు సినీరంగంలోఅడుగుపెట్టింది.

మొదటి సినిమాతోనే అందం, అభినయంతో కట్టిపడేసిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత బ్యాక్ టూ బ్యాక్ అవకాశాలు అందుకుంటూ తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించుకుంది.

ఇప్పుడు తెలుగు, మలయాళంలో వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది అందాల భామ అనుపమ పరమేశ్వరన్

పరదా, కిష్కింధపురి, జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ వంటి చిత్రాలతో అలరించిన అనుపమ.. ఇప్పుడు బైసన్ సినిమాతో మరో హిట్టు ఖాతాలో వేసుకుంది.

చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ బైసన్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ చిత్రానికి తెలుగులో మంచి రెస్పాన్స్ వచ్చింది. 

కానీ ఈ ముద్దుగుమ్మ తెలుగులో పెద్దగా యాక్టివ్ గా కనిపించడంలేదు.. కుర్ర హీరోయిన్స్ వరుసగా సినిమాలు చేస్తుంటే అనుపమ మాత్రం రేస్ లో వెనకబడిపోతోంది.