May 17, 2026
Subhash
చాణక్యుడి ప్రకారం, ఏ బంధంలోనైనా గౌరవం చాలా ముఖ్యం. భార్యాభర్తలు ఒకరినొకరు తక్కువ చేసి మాట్లాడకూడదు. పరస్పరం గౌరవించుకోవాలి. అప్పుడే ఇద్దరి మధ్య గొవలు ఉండవు.
సంసారంలో 'నేనే గొప్ప' అనే అహంకారం ఉండకూడదు. బంధాన్ని కాపాడుకోవడానికి అవసరమైనప్పుడు తగ్గి ఉండటం ఇద్దరికీ మంచిది. ఇద్దరి మధ్య ఈగో అనేది మరింత దూరం చేస్తుంది.
దంపతుల మధ్య రహస్యాలు ఉండకూడదు. అలాగే, ఇంటి విషయాలను లేదా భార్యాభర్తల మధ్య గొడవలను మూడో వ్యక్తితో పంచుకోకూడదు. ఇద్దరి మధ్య నమ్మకం, గోప్యత చాలా ముఖ్యం.
కోపంలో తీసుకునే నిర్ణయాలు, మాట్లాడే మాటలు బంధాన్ని బలహీనపరుస్తాయి. అందుకే భాగస్వామిపై కోపాన్ని వీలైనంత వరకు అదుపులో ఉంచుకోవాలి.
కష్ట సమయాల్లో ఒకరికొకరు ధైర్యంగా నిలబడే దంపతుల సంసారం ఎప్పటికీ సంతోషంగా సాగుతుందని చాణక్య నీతి చెబుతోంది. ఇద్దరు కూడా ఒకరినొకరు అర్థం చేసుకోవడం చాలా మంచిది.
మీ భాగస్వామిని ప్రేమించండి, గౌరవించండి. అప్పుడే మీ వైవాహిక జీవితం ఆనందాల నిలయంగా మారుతుంది. ఇలాంటి సమయంలో ఇద్దరి మధ్య బంధం దృఢంగా మారుతుంది.
భార్యాభర్తలిద్దరు కూడా సమయం కేటాయించడం. ఎంత బిజీగా ఉన్నా ఒకరికోసం ఒకరు సమయం కేటాయించుకోవాలి. కలిసి మాట్లాడడం, నవ్వుకోవడం వల్ల మనస్పర్థలు దూరమవుతాయి.
ఏ సమస్య ఉన్నా దాచుకోకుండా ఇద్దరూ కూర్చుని ప్రశాంతంగా మాట్లాడుకోవాలి. దీనివల్ల అపార్థాలు తొలగిపోతాయి. దాపరికాలు ఉంటే బంధం మరింత దూరం అవుతుందంటున్నారు చాణక్యుడు.