AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అడ్డంగా దొరికిపోయిన వందే భారత్  టీటీఈ.. వీడియో వైరల్

అడ్డంగా దొరికిపోయిన వందే భారత్ టీటీఈ.. వీడియో వైరల్

Phani CH
|

Updated on: May 16, 2026 | 2:53 PM

Share

వందేభారత్‌ రైలులో ప్రయాణికుడితో కేవలం ₹380కి సీటు ఇస్తానంటూ బేరసారాలు చేసిన టీటీఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. రైల్వే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఆ అధికారిని భారతీయ రైల్వే వెంటనే సస్పెండ్ చేసింది. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, మరికొందరు పాత రైల్వే అడ్జస్ట్‌మెంట్ రోజుల్ని గుర్తు చేసుకుంటూ వ్యంగ్య కామెంట్లు చేస్తున్నారు.

వందేభారత్ రైలులో ప్రయాణం చేయాలంటే కొంత ఎక్కువే పెట్టి టికెట్ కొనాల్సి ఉంటుంది. అదంతా ఎందుకు.. కేవలం 380 రూపాయలు ఇవ్వు, నీకు ఎలాగైనా ఒక సీటు అడ్జస్ట్ చేస్తా. ఓ టీటీఈ నిర్వాకం నిర్లక్ష్యంగా చేసిన బేరసారాలు ఇప్పుడు నెట్టింట తీవ్ర దుమారం రేపుతున్నాయి. రైల్వే నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణికుడితో అనధికారికంగా టికెట్ బేరాలకు దిగిన ఆ TTEని భారతీయ రైల్వే వెంటనే సస్పెండ్ చేసింది. ‘ఎక్స్’ వేదికగా ఈ బేరసారాల వీడియో వైరల్ కావడంతో రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. వందే భారత్‌ రైలు బోగీలో ప్రయాణికుడితో టీటీఈ సాగించిన సంభాషణ మొత్తం వీడియోలో చాలా స్పష్టంగా రికార్డ్ అయింది. ప్రయాణికుడు వెళ్లాల్సిన గమ్యస్థానానికి అసలు టికెట్ ధర దాదాపు 700 రూపాయల వరకు ఉంటుంది. వాస్తవానికి ఆ ప్రయాణికుడిని రెగ్యులర్ బుకింగ్ విధానం ద్వారా అధికారికంగా ఆన్‌లైన్ లో టికెట్ తీసుకోమని సూచించాల్సిన బాధ్యత విధి నిర్వహణలో ఉన్న టీటీఈ పై ఉంది. కానీ ఆ అధికారి అలా చేయకపోగా దానికి పూర్తి భిన్నంగా ప్రవర్తించాడు. అనధికారికంగా ప్రయాణించడం చట్టపరంగా నేరం అని ప్రయాణికుడికి చెబుతూనే.. కేవలం 380 రూపాయలకు సీటు ఇస్తానని బేరమాడాడు. ఈ వ్యవహారాన్ని గమనించిన కోచ్‌లోని మరో ప్రయాణికుడు రహస్యంగా తన ఫోన్‌లో ఈ సంభాషణ రికార్డ్ చేసాడు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొద్ది నిమిషాల్లోనే ఈ వ్యవహారం బట్టబయలైంది. వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైల్వే సేవా, దానాపూర్ డివిజన్ డీఆర్‌ఎం (DRM) ఖాతాలకు వీడియోను ట్యాగ్ చేశారు. అప్రమత్తమైన రైల్వే ఉన్నతాధికారులు ఆ వీడియోలో బేరసారాలకు దిగిన TTEని గుర్తించి తక్షణం సస్పెన్షన్ వేటు వేశారు. రైలులో అనధికారికంగా టికెట్లు జారీ చేయడంతో పాటు, పారదర్శకత లోపించడం, విధి నిర్వహణలో దుష్ప్రవర్తన కింద కేసు నమోదు చేసి దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతిష్టాత్మక వందేభారత్ లో అవినీతి అధికారుల వసూళ్లు ఏంటని నెట్టింట తీవ్రంగా విమర్శిస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం ఈ ఘటన పట్ల కాస్త వ్యంగ్యంగా స్పందించారు. పాత రైల్వే పద్ధతులను, అప్పట్లో టీటీఈలు చేసే ఇలాంటి చీకటి అడ్జస్ట్‌మెంట్లను ఈ వీడియో మరోసారి కళ్లముందు ఉంచిందని కామెంట్లు పెడుతున్నారు. ఇంకొందరైతే టీటీఈ కేవలం ఆ ప్రయాణికుడికి డబ్బులు ఆదా చేయబోయి అడ్డంగా ఇరుక్కుపోయాడంటూ జోక్‌ చేశారు. భారతీయ రైల్వేల్లో టికెట్ బుకింగ్‌, ఫేర్ కలెక్షన్‌ విషయంలో కఠిన నిబంధనలు అమల్లో ఉన్నాయి. సాధారణంగా ప్రయాణికుడు ముందుగానే టికెట్ బుక్ చేసుకోవాలి. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే రైలులోనే టికెట్ ఇవ్వడానికి TTEకి అధికారాలుంటాయి. వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉన్న ప్రయాణికులకు ఖాళీ సీట్లు కేటాయించడం, అందుబాటులో ఉన్న బెర్త్‌లను ఇవ్వడం వంటివి TTEలు చేయవచ్చు. అయితే… చాలామందికి తెలియని విషయం ఏమిటంటే.. టికెట్ లేకుండా ఎక్కినా, వెంటనే TTEని సంప్రదిస్తే కొన్ని సందర్భాల్లో లీగల్‌గా టికెట్ పొందే అవకాశం ఉంటుంది. కానీ… అది పూర్తిగా రైల్వే నిబంధనల ప్రకారమే జరగాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

USA లో ఉద్యోగం ఇక కష్టమే! ఉద్యోగుల జీతాలపై అమెరికా కొత్త ప్లాన్

బిడ్డను పెంచడానికి రూ.6.5 కోట్లా ?? ఇండియాలో వేగంగా పెరుగుతున్న DINK కల్చర్‌

భోజనం ముందు రెస్టారెంట్లలో నో ఫోన్.. నో స్క్రోల్‌ నిబంధన

ఆలయంలో వింత ఆచారం.. భక్తులకు ఉచితంగా డబ్బులు పంపిణీ

పోస్ట్ చూడగానే వ్యూస్‌ వస్తాయనుకుంటే.. పోలీసులొచ్చారు

Follow Us