భోజనం ముందు రెస్టారెంట్లలో నో ఫోన్.. నో స్క్రోల్ నిబంధన
భోజనం చేస్తూనే ఫోన్ స్క్రోల్ చేయడం ఇప్పుడు చాలామందికి అలవాటైపోయింది. దీంతో ఆహారం రుచి, కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో సంభాషణల ఆనందం తగ్గిపోతోంది. ఈ పరిస్థితిని మార్చేందుకు అమెరికాలో ప్రారంభమైన ‘నో-ఫోన్ డైనింగ్’ ట్రెండ్ ఇప్పుడు ఇండియాలోని హైఎండ్ రెస్టారెంట్లకు కూడా విస్తరిస్తోంది. ఫోన్‌లను పక్కన పెట్టి మనుషులతో మాట్లాడే సంస్కృతిని ప్రోత్సహించే ఈ కొత్త ఉద్యమం యువతలోనూ ఆదరణ పొందుతోంది.
ఎప్పుడూ ఫోన్ స్క్రోల్ చేస్తూ కూర్చోవడంవల్ల భోజన సమయంలో రుచిని, ఆనందాన్ని ప్రజలు మనస్ఫూర్తిగా ఆస్వాదించలేకపోతుంటారు. అలాగే మనుషుల మధ్య సంభాషణలు, సంబంధాలు కూడా తగ్గుతున్నాయి. నో-స్క్రోల్ నో ఫోన్ ఉద్యమాన్ని అమెరికాలోని రెస్టారెంట్ యజమానులు తీసుకొచ్చారు. స్వయంగా ముందుకు తెచ్చి అమలు చేయడం ప్రారంభించారు. అయితే విదేశాల్లోలాగా ఇండియాలో పూర్తిస్థాయిలో ఇది వ్యాపించలేదు. మన దేశంలోని హై-ఎండ్ రెస్టారెంట్లు, సూపర్ క్లబ్‌లు , ఫైన్ డైనింగ్ ప్లేస్‌లలో ఇప్పుడిప్పుడే ‘నో ఫోన్’ మూవ్‌మెంట్ ప్రారంభమైంది. కొన్ని ప్రముఖ రెస్టారెంట్లు ఫోన్లను టేబుల్ మీద ఉంచకూడదని, ఫొటోలు తీయకూడదని కస్టమర్లను కోరుతున్నాయి. డైనింగ్ అనుభవాన్ని మెరుగుపరచడం, సంభాషణలు పెంచడమే ప్రధాన ఉద్దేశమని చెబుతున్నాయి. ముంబై, ఢిల్లీ, బెంగళూరులో కొన్ని రెస్టారెంట్లు ‘ఫోన్-ఫ్రీ డైనింగ్’ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నాయి. ఆఫీసుల్లోనో, ఆస్పత్రుల్లోనో ఫోన్ల వాడకాన్ని తగ్గించాలనడం సాధారణమే. కానీ రెస్టారెంట్లు, బార్లల్లో కూడా ఈ నిబంధనను అమలు చేస్తే.. జనాలు వాటిని ఫాలో అయితే.. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ. ఇటీవల ఈ ట్రెండ్ విస్తరిస్తోంది. అనేక దేశాల్లోని రెస్టారెంట్లు, బార్లు ఫోన్ వాడకాన్ని నియంత్రించడం ద్వారా భోజన సమయంలో ప్రజలు ఒకరితో ఒకరు మాట్లాడుకునే వాతావరణాన్ని పెంపొందించాలని ప్రయత్నం చేస్తున్నాయి. ఈ ‘నో-స్క్రోల్/నో ఫోన్ మూమెంట్’ అమెరికాలో మరింత వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఫోన్ ఫ్రీ డైనింగ్ లేదా నో స్క్రోల్ ట్రెండ్ ఫాలో అవుతున్న రెస్టారెంట్లు కస్టమర్లు వచ్చినప్పుడు ఫోన్లను టేబుల్ మీద ఉంచకూడదని, కాల్స్ లేదా స్క్రోలింగ్ నిషేధమని ముందుగానే చెప్పేస్తున్నాయి. నోటీసు బోర్డుల్లోనూ పెడుతున్నాయి. కొన్నయితే ఫోన్లను లాక్ చేసి, భోజనం పూర్తయ్యే వరకు ఇవ్వవు. అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రంలోని కాక్‌టైల్ బార్ కస్టమర్ల ఫోన్లను రెండు గంటలపాటు లాక్ చేస్తుంది. అలాగే అప్‌స్కేల్ సూపర్ క్లబ్ “నో ఫోన్స్, నో పోస్టింగ్” పాలసీ అమలు చేస్తోంది. ఫోన్-ఫ్రీ డైనింగ్’ మూవ్‌మెంట్ ఇటీవల పాపులర్ అవుతోంది. జెన్‌జీలు సైతం భోజన సమయంలో ఫోన్ వాడకూడదనే ఈ మార్పును స్వాగతిస్తున్నారు. ఇలా చేయడం వల్ల మునుపటి కంటే సంభాషణలు పెరిగాయనీ, ఆహారం రుచిగా అనిపించిందనీ కస్టమర్లు కామెంట్ చేయడం విశేషం. మొత్తానికి రెస్టారెంట్లలో స్నేహపూర్వక, ప్రశాంత వాతావరణాన్ని క్రియేట్ చేయడంలో ఈ కొత్త ట్రెండ్ కీ రోల్ పోషిస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆలయంలో వింత ఆచారం.. భక్తులకు ఉచితంగా డబ్బులు పంపిణీ
పోస్ట్ చూడగానే వ్యూస్ వస్తాయనుకుంటే.. పోలీసులొచ్చారు
తెలుగువారు ఇకపై గోవాకు వెళ్లక్కరలేదు.. ఈ బీచ్ లో అంతకుమించిన
మగవాళ్లలో వై క్రోమోజోమ్ అంతరించిపోతే..? శాస్త్రవేత్తల ఆసక్తికర వివరణ
జస్ట్ 30 నిమిషాల్లో.. 12 కి.మీ జర్నీ హైదరాబాద్ స్పీడ్‌కు బెంగళూరు టెకీ ఫిదా..
అడ్డంగా దొరికిపోయిన వందే భారత్ టీటీఈ.. వీడియో వైరల్
బిడ్డను పెంచడానికి రూ.6.5 కోట్లా ??
భోజనం ముందు రెస్టారెంట్లలో నో ఫోన్.. నో స్క్రోల్ నిబంధన
ఆలయంలో వింత ఆచారం.. భక్తులకు ఉచితంగా డబ్బులు పంపిణీ
పోస్ట్ చూడగానే వ్యూస్ వస్తాయనుకుంటే.. పోలీసులొచ్చారు
30 నిమిషాల్లో.. 12KM జర్నీ హైదరాబాద్ స్పీడ్‌కు బెంగళూరు టెకీ ఫిదా
ఏడాదికి 50 లక్షల జీతం.. 10 వేల ఫోన్.. ఆటోలో ఆఫీసుకు..

