తెలుగువారు ఇకపై గోవాకు వెళ్లక్కరలేదు.. ఈ బీచ్ లో అంతకుమించిన
ఆంధ్రప్రదేశ్‌లో బీచ్ టూరిజాన్ని అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తోంది. సూర్యలంక బీచ్‌ను గోవా తరహాలో తీర్చిదిద్దేందుకు వంద కోట్ల రూపాయలతో పనులు కొనసాగుతున్నాయి. అడ్వంచర్ టూరిజం, హౌస్ బోటింగ్, రిసార్ట్స్, స్టార్ హోటల్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2029 నాటికి రాష్ట్రాన్ని ప్రపంచ టూరిజం డెస్టినేషన్‌గా మార్చాలని మంత్రులు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్‌లో బీచ్‌ల అభివృద్ధిపై ఫోకస్ పెట్టింది కూటమి సర్కార్. ఈ అంశంపై మంత్రులు ప్రత్యేకంగా సమీక్ష చేసి, అధికారులకు దిశానిర్దేశం చేశారు. వందకోట్ల రూపాయలతో సూర్యలంక బీచ్‌లో జరుగుతున్న స్వదేశీ దర్శన్ పనులను పరిశీలించారు మంత్రులు అనగాని సత్యప్రసాద్, కందుల దుర్గేష్. బీచ్ అభివృద్ధిపై రివ్యూ చేసిన మంత్రులు..బీచ్‌లో బే ఆఫ్ బాపట్ల పనులకు శంఖుస్థాపన చేశారు. అనంతరం బీచ్‌లో అడ్వంచర్ టూరిజంను ప్రారంభించారు. 2029 నాటికి ప్రపంచ టూరిజం డెస్టినేషన్‌గా రాష్ట్రాన్ని నిలపాలన్న ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా పని చేస్తున్నామని చెప్పారు మంత్రి కందుల దుర్గేశ్. హైదరాబాద్ వాసులకు కూడా బాపట్ల, చీరాల బీచ్‌లు అందుబాటులో ఉంటాయని గుర్తుచేసిన మంత్రి… సూర్యలంక బీచ్ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్నామన్నారు. ప్రైవేట్ భాగస్వామ్యంతో రిసార్ట్స్, స్టార్ హోటల్స్ నిర్మిస్తామన్నారు. సినిమా షూటింగ్స్ కు కూడా ఇది అనువైన ప్రాంతమని.. నిర్మాతలకు సూచించారు కందుల. ప్రపంచంలో చాలా దేశాలు టూరిజంపైనే ఆధారపడి అభివృద్ది చెందాయన్న మంత్రి అనగాని.. గత పాలకుల తీరుతో టూరిజంలో రాష్ట్రం ముప్పై ఏళ్ళు వెనక్కిపోయిందని విమర్శించారు. ఫ్లెమింగో ఫెస్టివల్ ను గత ప్రభుత్వం నిర్వహించలేదన్న మంత్రి… ఆ కారణంగానే ఫ్లెమింగోస్ ఇతర దేశాలకు వెళ్లిపోయాయని చెప్పారు. అక్వాతో పాటు టూరిజాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఇప్పటికే గోవాలో టూరిజంను ఎలా అభివృద్ది చేశారు అన్న అంశాలను పరిశీలించి వచ్చారు. గోవా బీచ్‌ను తలపించేలా సూర్యలంక బీచ్‌ను అభివృద్ధి చేస్తామని చెప్పారు. భౌగోళిక అనుకూలతలతో పాటు అందరికి అందుబాటులో ఉండటంతో సూర్యలంక బీచ్ పై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. హౌస్ బోటింగ్ ను త్వరలోనే పర్యాటకులకు అందుబాటులోకి తెస్తామన్నారు. బ్రాండ్ ఇమేజ్ తో సూర్యలంక రూపు రేఖలు మారిపోతాయన్నారు. పర్యాటకుల స్వర్గధామంగా మారుస్తామన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మగవాళ్లలో వై క్రోమోజోమ్ అంతరించిపోతే..? శాస్త్రవేత్తల ఆసక్తికర వివరణ
జస్ట్ 30 నిమిషాల్లో.. 12 కి.మీ జర్నీ హైదరాబాద్ స్పీడ్‌కు బెంగళూరు టెకీ ఫిదా..
ఏడాదికి 50 లక్షల జీతం.. 10 వేల ఫోన్.. ఆటోలో ఆఫీసుకు.. ఈ ఐటీ ఉద్యోగిని కథ వైరల్
ఫ్రిజ్‌లో కూరగాయలు కుళ్ళిపోతున్నాయా ?? అద్భుతమైన చిట్కా మీకోసం
హైవేపై మహిళ బైక్ కు పంక్చర్.. సాయం చేసేందుకు పోటీపడిన యువకులు
30 నిమిషాల్లో.. 12KM జర్నీ హైదరాబాద్ స్పీడ్‌కు బెంగళూరు టెకీ ఫిదా
ఏడాదికి 50 లక్షల జీతం.. 10 వేల ఫోన్.. ఆటోలో ఆఫీసుకు..
హైవేపై మహిళ బైక్ కు పంక్చర్.. సాయం చేసేందుకు పోటీపడిన యువకులు
వెయ్యేళ్ల నాటి నిధి లభ్యం.. అంతా స్వచ్ఛమైన బంగారమే
నా శవాన్ని చెత్తకుప్పలో వేయండి..కంటతడి పెట్టిస్తున్ననోట్
డబ్బులు డ్రా చేసుకోడానికి వెళ్తే హెయిర్‌కట్!
పావురంలా అందంగా కనిపించే ఈ పక్షి.. వెరీ డేంజర్

