హైవేపై మహిళ బైక్ కు పంక్చర్.. సాయం చేసేందుకు పోటీపడిన యువకులు
భారతదేశంలో సోలో బైక్ యాత్ర చేస్తున్న డచ్ ట్రావెలర్ మైకే హిజ్మాన్‌కు హైవేపై బైక్ పంక్చర్ కావడంతో ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ముగ్గురు వ్యక్తులు ఆమెకు సహాయం చేసి బైక్‌ను రిపేర్ చేయడంతో పాటు మెకానిక్ దగ్గరకు సురక్షితంగా తీసుకెళ్లారు. ఈ ఘటనను వీడియోగా పంచుకున్న మైకే భారతీయుల సహాయస్ఫూర్తిని ప్రశంసించింది.
భారతీయ సంస్కృతిలోని ‘అతిథి దేవో భవ’ అనే మాటకు మరోసారి అర్థం చెప్పారు మనవాళ్లు. సోలో మోటార్ సైకిల్ యాత్రలో భాగంగా భారతదేశాన్ని చుట్టేస్తున్న డచ్ ట్రావెలర్ మైకే హిజ్మాన్ కు ఒక హైవేపై చేదు అనుభవం ఎదురైంది.ఆమె ప్రయాణిస్తున్న బైక్ టైర్ మధ్యలోనే పంక్చర్ కావడంతో, ఎటు వెళ్లాలో తెలియక రోడ్డు పక్కన ఒంటరిగా నిలబడిపోయింది. ఒంటరిగా ప్రయాణిస్తున్న సమయంలో బైక్ మొరాయించడంతో మైకే తీవ్ర ఆందోళనకు గురైంది. భాష తెలియదు, పరిసరాలపై అవగాహన లేదు. ఈ క్రమంలో అప్పుడే అటుగా వెళ్తున్న ముగ్గురు వ్యక్తులు ఆమె పరిస్థితిని గమనించి వెంటనే తమ వాహనాన్ని ఆపారు. ఏమాత్రం సంకోచించకుండా బైక్ టైర్‌ను పరిశీలించి, తాత్కాలికంగా దానిని రిపేర్ చేశారు. అంతటితో ఆగకుండా, ఆమెను సురక్షితంగా సమీపంలోని మెకానిక్ షెడ్ వరకు తీసుకెళ్లి మరీ సాగనంపారు. ఈ మొత్తం ఘటనను మైకే తన ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో రూపంలో పంచుకుంది. “భారతదేశంలో ఇలాంటి వ్యక్తులు ఉన్నంతవరకు నాకు ఏ భయం లేదు” అంటూ ఆమె సంతోషం వ్యక్తం చేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. “విదేశీ పర్యాటకులు గుర్తుంచుకునే అసలైన భారతదేశం ఇదే” అని కొందరు, “నిజమైన భారతీయుల గొప్పతనం ఇదే” అని మరికొందరు కామెంట్లతో ముంచెత్తుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం మిలియన్ల వ్యూస్‌తో సోషల్ మీడియాలో ట్రెండవుతోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వెయ్యేళ్ల నాటి నిధి లభ్యం.. అంతా స్వచ్ఛమైన బంగారమే
నా శవాన్ని అమ్మానాన్నలకు చూపించొద్దు.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్
డబ్బులు డ్రా చేసుకోడానికి వెళ్తే హెయిర్‌కట్! వైరల్ అవుతున్న ‘సెలూన్ ఏటీఎం’ కథ
హైవేపై మహిళ బైక్ కు పంక్చర్.. సాయం చేసేందుకు పోటీపడిన యువకులు
వెయ్యేళ్ల నాటి నిధి లభ్యం.. అంతా స్వచ్ఛమైన బంగారమే
నా శవాన్ని చెత్తకుప్పలో వేయండి..కంటతడి పెట్టిస్తున్ననోట్
డబ్బులు డ్రా చేసుకోడానికి వెళ్తే హెయిర్‌కట్!
పావురంలా అందంగా కనిపించే ఈ పక్షి.. వెరీ డేంజర్
అరుదైన 'నేల మామిడి'ని చూశారా?
ప్రపంచంలో ఈ ఒక్క చోట మాత్రం ప్రతీ రాత్రి ఉరుములు మెరుపులే

