మగవాళ్లలో వై క్రోమోజోమ్ అంతరించిపోతే..? శాస్త్రవేత్తల ఆసక్తికర వివరణ
మగ పిల్లలు పుట్టడానికి కీలకమైన వై క్రోమోజోమ్ క్రమంగా క్షీణిస్తోందన్న వార్తలు చర్చనీయాంశమయ్యాయి. అయితే వై క్రోమోజోమ్ పూర్తిగా అదృశ్యమైనా మానవజాతి వెంటనే అంతరించిపోదని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. కొన్ని జంతు జాతుల్లో ఇప్పటికే ప్రత్యామ్నాయ లింగ నిర్ధారణ వ్యవస్థలు ఉన్నాయని, మానవుల్లో కూడా అలాంటి పరిణామం సంభవించే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.
మానవులు సహా క్షీరదాల జాతుల్లో పునరుత్పత్తి కోసం ఆడ, మగ అవసరం. ఈ ప్రక్రియలో ఎక్స్, వై క్రోమోజోములు కీలకం. పుట్టబోయే బిడ్డ ఆడా.. మగా.. అన్నది నిర్ధరించే బాధ్యత ‘వై’ క్రోమోజోములోని కీలక జన్యువుదే. అయితే మానవుల్లోని ఈ క్రోమోజోమ్ క్రమంగా క్షీణిస్తోందని, అది పూర్తిగా కనుమరుగు కావొచ్చని, ఫలితంగా మానవాళి అంతరించిపోవచ్చన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. ఆడపిల్లలు పుడతారా, మగ పిల్లలు పుడతారా అనేది పూర్తిగా మగవారిపైనే ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఆడవారిలో ఎక్స్ క్రోమోజోములు ఉంటాయి. ఆడవారు గర్భం దాల్చే సమయంలో వారి ఎక్స్ క్రోమోజోములు మగవారి వై క్రోమోజోములు కలిస్తే మగ పిల్లలు పుడతారు. అలా కాకుండా ఇద్దరికీ చెందిన ఎక్స్, ఎక్స్ క్రోమోజోములు కలిస్తే ఆడపిల్లలు పుడతారు. అయితే తాజాగా శాస్త్రవేత్తలు చర్చలో భాగంగా మరోసారి మగవారిలో వై క్రోమోజోములు క్రమంగా కనుమరుగు అవుతున్నట్లు తెలిపారు. వై క్రోమోజోములు తగ్గిపోయినా లేకపోతే పూర్తిగా అదృశ్యమైనా మానవజాతి పూర్తిగా అంతరించిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే వై క్రోమోజోములు లేకపోతే మగవారు పుట్టరు. ప్రపంచం మెుత్తం పూర్తిగా ఆడవారే పుడతారు. దీంతో సృష్టి ఆగిపోతుంది. మగజాతి లేకపోతే పునరుత్పత్తికి అవకాశమే ఉండదు. కాబట్టి ఇక మానవజాతి అంతరించిపోయే ప్రమాదం పొంచి ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ప్రక్రియ జరగడానికి కొన్ని సంవత్సరాలు పడుతుందని, అయితే ఈ లోపే కొత్త అధ్యయనాలు అవసరం అని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. వై క్రోమోజోములు తగ్గిపోతున్న నేపథ్యంలో కొత్త అధ్యయనాలు చేపట్టి ప్రత్యామ్నాయ మార్గం చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే భూగ్రహం మీద ఇకపై మానవజాతి మిగిలే అవకాశం లేకుండా పోతుంది. గత 30 కోట్ల సంవత్సరాలలో వై క్రోమోజోమ్ తనలోని 97 శాతం జన్యువులను కోల్పోయిందని, ఇది భవిష్యత్తులో పూర్తిగా కనుమరుగయ్యే అవకాశం ఉందని కొందరు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అది నిజంగానే పురుషుల అస్తిత్వానికి ముప్పు తెస్తుందా? ఈ ప్రశ్నకు శాస్త్రవేత్తలు వెంటనే ‘కాదు’ అనే సమాధానం ఇస్తున్నారు. వై క్రోమోజోమ్ భవిష్యత్తుపై దశాబ్దాలుగా ఇద్దరు ప్రముఖ శాస్త్రవేత్తలు, జెన్నీ గ్రేవ్స్ , జెన్ హ్యూజెస్ మధ్య గౌరవప్రదమైన చర్చ జరుగుతోంది. ఒకే ఆధారాలను పరిశీలించినా, వీరిద్దరూ భిన్నమైన ముగింపులకు వచ్చారు. ఈ వివాదంలో చర్చించిన కీలక అంశం ఒకటి ఉంది. ఒకవేళ వై క్రోమోజోమ్ పూర్తిగా అదృశ్యమైనా, పురుషులు అంతరించిపోరు. జంతు ప్రపంచంలో దీనికి ఇప్పటికే ఆధారాలున్నాయి. కొన్ని ఎలుక జాతులలో వై క్రోమోజోమ్ లేకపోయినా, లింగ నిర్ధారణ బాధ్యతను మరో క్రోమోజోమ్ స్వీకరించింది. మానవులలో కూడా ఇదే జరగవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. లింగ నిర్ధారణ బాధ్యత మరో క్రోమోజోమ్‌కు బదిలీ కావచ్చు. కాబట్టి, వై క్రోమోజోమ్ భవిష్యత్తు ఏమైనప్పటికీ, అది మానవాళి ఆందోళన చెందాల్సినంత వేగంగా జరిగే పరిణామం కాదు. లక్షల సంవత్సరాల తర్వాత జరిగే ఈ మార్పు గురించి ఇప్పుడు భయపడటం అనవసరమని, ఇది కేవలం శాస్త్ర రంగంలో ఒక ఆసక్తికరమైన పరిశోధనాంశం మాత్రమేనని నిపుణులు అంటున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
జస్ట్ 30 నిమిషాల్లో.. 12 కి.మీ జర్నీ హైదరాబాద్ స్పీడ్‌కు బెంగళూరు టెకీ ఫిదా..
ఏడాదికి 50 లక్షల జీతం.. 10 వేల ఫోన్.. ఆటోలో ఆఫీసుకు.. ఈ ఐటీ ఉద్యోగిని కథ వైరల్
ఫ్రిజ్‌లో కూరగాయలు కుళ్ళిపోతున్నాయా ?? అద్భుతమైన చిట్కా మీకోసం
హైవేపై మహిళ బైక్ కు పంక్చర్.. సాయం చేసేందుకు పోటీపడిన యువకులు
పోస్ట్ చూడగానే వ్యూస్ వస్తాయనుకుంటే.. పోలీసులొచ్చారు
30 నిమిషాల్లో.. 12KM జర్నీ హైదరాబాద్ స్పీడ్‌కు బెంగళూరు టెకీ ఫిదా
ఏడాదికి 50 లక్షల జీతం.. 10 వేల ఫోన్.. ఆటోలో ఆఫీసుకు..
హైవేపై మహిళ బైక్ కు పంక్చర్.. సాయం చేసేందుకు పోటీపడిన యువకులు
వెయ్యేళ్ల నాటి నిధి లభ్యం.. అంతా స్వచ్ఛమైన బంగారమే
నా శవాన్ని చెత్తకుప్పలో వేయండి..కంటతడి పెట్టిస్తున్ననోట్
డబ్బులు డ్రా చేసుకోడానికి వెళ్తే హెయిర్‌కట్!

