Chicken Price: చికెన్ లవర్స్‌కు అదిరిపోయే గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన ధరలు.. కేజీ ఎంతంటే?
తెలుగురాష్ట్రాల్లోని నాన్‌వెజ్ ప్రియులకు ఇదో శుభవార్తే అని చెప్పవచ్చు. ఎందుకుంటే గత కొన్ని రోజులుగా ఆకాశాన్నంతున్న చికెన్ ధరలు ఇవాళ భారీగా దిగొచ్చాయి. నిన్నటి వరకు మార్కెట్‌లో ఏకంగా రూ.300 నుంచి రూ.350 వరకు పలికిన కేజీ చికెన్ ధర ఇప్పుడు తగ్గుముఖం పట్టింది. దీంతో మళ్లీ చికెన్ ప్రియులు షాప్‌లకు క్యూ కట్టారు. ఇంతకూ ప్రస్తుతం కేజీ చికెన్ ధర ఎంత ఉందో చూద్దాం పదండి.

తెలుగు రాష్ట్రాల్లో గత వారం రోజులుగా చికెన్ ప్రియులకు చుక్కలు చూపించిన ధరలు.. తాజాగా కాస్త శాంతించాయి. ఒకానొక దశలో కేజీ చికెన్ ధర ఏకంగా రూ. 300 నుంచి రూ. 350 వరకు పలకడంతో చికెన్ సెంటర్ల వైపు వెళ్లడానికే సమాన్యులు భయపడే పరిస్థితి వచ్చింది. దాదాపు మటన్ ధరకు చేరువలో చికెన్ రేట్లు ఉండడంతో చాలా మంది చికెన్‌కు ప్రత్యామ్నాయంగా మటన్, చేపల వైపు మొగ్గు చూపారు. అయితే, కానీ తాజాగా ధరలు భారీగా తగ్గడంతో చికెన్ షాపులు మళ్లీ కస్టమర్లతో కళకళలాడుతున్నాయి.
ఎండాకాలంలో మారిన సీన్
సాధారణంగా వేసవి కాలం వచ్చిందంటే చికెన్ ధరలు తగ్గుముఖం పడతాయి. ఎండల తీవ్రతకు కోళ్లు త్వరగా చనిపోతాయనే భయంతో పౌల్ట్రీ యజమానులు వాటిని తక్కువ ధరలకే విక్రయిస్తుంటారు. దానికితో ఎండాకాలంలో చికెన్ తినడం వల్ల వేడి చేస్తుందని, ఆరోగ్య సమస్యలు వాస్తయని ప్రజలు కూడా చికెన్‌కు కాస్త దూరంగా ఉంటారు. ఇది కూడా తమ వ్యాపారాన్ని దెబ్బతీస్తుందని వ్యాపరస్తులు అనుకొని రేట్లు తగ్గిస్తారు. కానీ, ఈ ఏడాది మాత్రం సీన్ రివర్స్ అయింది. గత వారం రోజులుగా చికెన్ రేట్లు ఆకాశాన్ని తాకాయి. కానీ వేసవి కాలం ముగుస్తుండడం, వాతావరణంలో కాస్త మార్పులు రావడంతో మళ్లీ చికెన్ ధరలు తగ్గుముఖం పట్టాయి.
తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు ఇలా
| ప్రాంతం | స్కిన్ లెస్ చికెన్ ధర | మటన్ ధర |
| హైదరాబాద్ | రూ. 250 – రూ. 260 | రూ. 800 – రూ. 950 |
| ఖమ్మం | రూ. 280 | రూ. 700 – రూ. 800 |
| గుంటూరు | రూ. 260 | రూ. 700 – రూ. 800 |
| రాజమండ్రి | రూ. 250 | రూ. 700 – రూ. 800 |
| విజయవాడ | రూ. 310 | రూ. 700 – రూ. 800 |
అయితే ఇతర జిల్లాలతో పోలిస్తే విజయవాడలో చికెన్ ధర ఇంకా రూ. 300 పైనే కొనసాగుతుండగా, హైదరాబాద్ మరియు మిగిలిన ప్రాంతాల్లో మాత్రం భారీగా తగ్గి వినియోగదారులకు ఊరటనిస్తోంది. మటన్ ధరలు మాత్రం జిల్లాల్లో రూ. 700 నుంచి రూ. 800 వరకు ఉంటే, హైదరాబాద్‌లో గరిష్టంగా రూ. 950 వరకు పలుకుతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
