రాశి ఖన్నా స్పీడ్ కు బ్రేకులు.. హిందీ పై ఫోకస్ పెడుతుందా.?

Rajeev 

16 May  2026

instagram

ఊహలు గుస గుసలాడే సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయమైన బ్యూటీ రాశి ఖన్నా. ఈ ముద్దుగుమ్మ అందానికి కుర్రాళ్లు ఫిదా అయ్యారు.

అమ్మడు మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా, యూత్‌లో మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది.

ఈ మూవీలో ఈ అమ్మడు నటనకు, అందానికి ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు. దీంతో ఈ సినిమా తర్వాత ఈ చిన్నదానికి వరసగా అవకాశాలు తలుపు తట్టాయి.

 ఈ ముద్దుగుమ్మ ఊహల గుసగుసలాడే సినిమా తర్వాత జోరు, జిల్, బెంగాల్ టైగర్, శివం, సుప్రీం, హైపర్, జై లవకుశ సినిమాలతో మెప్పించింది. 

అలాగే టచ్ చేసి చూడు, తొలి ప్రేమ,ప్రతి రోజూ పండుగే, వెంకీ మామ,వరల్డ్ ఫేమస్ లవ్, తిరు, పక్కా కమర్షియల్ సినిమాల్లో నటించి మెప్పించింది.

ఇక ఈ మధ్య ఈ అమ్మడుకు తెలుగులో కొంత వరకు అవకాశాలు తగ్గాయి. అందువలన కాస్త బ్రేక్ ఇచ్చిన ఈ చిన్నది,

సిద్దు జొన్నల గడ్డ సరసన తెలుసు కదా మూవీతో ఎంట్రీ ఇచ్చి తన నటనతో మరోసారి అభిమానుల హృదయాలను గెలుచుకుంది.