యాలకులు అమృతం లాంటివే.. కానీ వీరు తింటే మాత్రం ప్రమాదమే!

May 16, 2026

Subhash

సువాసన, రుచి, ఔషధ గుణాలకు యాలకులు ఎంతో ప్రసిద్ధి. కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవారు దీనిని తినడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుంది. అవేంటో తెలుసుకుందాం.

యాలకులు

గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు అతిగా తీసుకోకూడదు. గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. ఒకటి రెండు పర్వాలేదు కానీ, ఔషధంగా ఎక్కువగా తీసుకోకూడదు.

గర్భిణీలు, పాలిచ్చే తల్లులు

పిత్తాశయంలో రాళ్లు ఉన్న రోగులు యాలకులను ఎక్కువగా తినకూడదు. యాలకులు జీర్ణక్రియను వేగవంతం చేస్తాయి. దీనివల్ల పిత్తాశయంలో కదలికలు పెరిగి విపరీతమైన నొప్పి, ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది.

పిత్తాశయంలో రాళ్లు

కొందరికి యాలకులు పడవు. దీనిని అతిగా తీసుకోవడం వల్ల చర్మంపై దద్దుర్లు, దురద, లేదా ఎర్రగా మారడం వంటి అలర్జీ లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా సున్నితమైన చర్మం ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి.

అలర్జీ

యాలకుల వల్ల అలర్జీ తీవ్రమైతే అది శ్వాసకోశ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. కొందరిలో గొంతు నొప్పి, ఛాతిలో బిగుతుగా అనిపించడం లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తవచ్చు.

శ్వాసకోశ సమస్యలు

దీర్ఘకాలిక వ్యాధులకు మందులు వాడుతుంటే, యాలకులు ఆ మందుల ప్రభావం చూపవచ్చంటున్నారు నిపుణులు. ముఖ్యంగా రక్తాన్ని పలచబరిచే మందులు, లివర్ మందులతో ఇవి రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది.

మందులతో రియాక్షన్

సాధారణ ఆరోగ్యవంతులు రోజుకు 1 నుండి 2 యాలకులు తీసుకోవడం సురక్షితం. ఎక్కువ మొత్తంలో తీసుకునే ముందు వైద్యుల సలహా తీసుకోవడం చాలా మంచిదంటున్నారు నిపుణులు.

ఎంత తీసుకోవాలి?

ఏ పదార్థమైనా అమితంగా తింటే విషమే అవుతుంది. యాలకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినప్పటికీ, పైన పేర్కొన్న సమస్యలు ఉన్నవారు వీటి వినియోగంలో తగిన జాగ్రత్తలు పాటించడం అవసరం.

జాగ్రత్తలు