Petrol: మన దేశంలోని ఏ రాష్ట్రంలో ఎక్కువ పెట్రోల్ వాడుతారో తెలుసా?
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఇందన కొరత ఏర్పడింది. ఈ క్రమంలో ఇందన వాడకంపై దేశ వ్యాప్తంగా చర్చ మొదలైంది. అయితే ప్రాంతాల వారిగా ప్రజల జీవనశైలిలో ఎలాగైతే మార్పులు ఉంటాయో, ఇందన వినియోగం కూడా ఒక్కో రాష్ట్రంలో ఒక్కొలా ఉంటుంది. కాబట్టి మన దేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కువ పెట్రోల్ వాడుతున్నారు ఇక్కడ తెలుసుకుందాం.

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఇందన కొరత ఏర్పడింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు భారీగా పెరిగిపోయాయి. ఈ క్రమంలో పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించాలని ప్రధాని మోదీ సూచించారు. ఈ క్రమంలో పెంట్రోల్ వాడకంపై పెద్ద చర్చ మొదలైంది. కొన్ని ప్రాంతాల్లో అవసరమున్న కొంతమేర మాత్రమే ఇందనాన్ని అందిస్తున్నారు. అయితే మన దేశంలో ప్రజల జీవనశైలితో పాటు ఇంధన వినియోగం కూడా ఒక్కో రాష్ట్రంలో ఒక్కాల ఉంటుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన లెక్కల ప్రకారం కొన్ని ప్రాంతాల్లో జాతీయ సగటు కంటే ఎక్కువ మోతాదులో ఇందన వినియోగం ఉంటే మరికొన్ని చోట్ల మాత్రం చాలా తక్కువ వినియోగం ఉంది.
2024-25 ఆర్థిక సంవత్సరం పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలసిస్ సెల్(PPAC) నివేదిక ప్రకారం.. మన దేశంలో ప్రతి 100 మందికి రోజువారీ పెట్రోల్ వినియోగం 10.4 లీటర్లుగా ఉంది. కానీ దేశవ్యాప్తంగా చూసుకుంటే ఈ పంపిణీలో చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. ఎక్కువగా అభివృద్ది చెందుతున్న, పర్యాటక పరంగా, రవాణా వ్యవస్థను ఎక్కువగా వాడే రాష్ట్రాల్లో ఇందన విడియో అధికంగా ఉన్నట్టు నివేదికలు స్పష్టం చేశాయి. ఈ వ్యత్యాసాలు ఆ రాష్ట్రాల్లోని అభివృద్ధి, ప్రజల జీవనశైలిని బట్టి మారుతాయి.
పెట్రోల్ వినియోగంలో టాప్ రేస్‌లో ఉన్న ప్రాంతాలు
పర్యాటకుల స్వర్గధామంగా పిలవబడే గోవా అత్యధికంగా పెట్రోల్ వినియోగించే జాబితాలో అగ్రస్థానంలో ఉన్నట్టు నివేదికలు చెబుతున్నాయి. గోవాలో ప్రతి 100 మందికి రోజువారీ పెట్రోల్ వినియోగం 52.4 లీటర్లుగా ఉంది. అంటే ఇది మొత్తం జాతీయ సగటు కంటే ఐదు రెట్లు ఎక్కువ. ఇక రెండో స్థానంలో కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి కొనసాగుతుంది. ఇక్కడ ప్రతి 100 మందికి రోజువారి పెట్రోల్ వినియోగం 41 లీటర్లగా ఉంది. 37.8 లీటర్లతో చండీఘడ్ 3వ స్థానంలో కొనసాగుతుంది.
ఎందుకు ఈ ప్రాంతాల్లో వినియోగం ఎక్కువ
ఈ ప్రాంతాల్లో పెట్రోల ఎక్కువగా వినియోగించడానికి ప్రధాన కారణం పర్యాటక రంగం. ఈ ప్రాంతాలలో పర్యాటకుల రాక ఎక్కువగా ఉండటం, అద్దె వాహనాల వినియోగం, చాలా తక్కువ దూరాలకు కూడా ఇక్కడి ప్రజలు సొంత వాహనాల్లో ప్రయాణించడంతో ఇక్కడ పెట్రోల్ వినియోగం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం చేయండి.
