Team India: బీసీసీఐ సంచలన నిర్ణయం.. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనకు టీమిండియా స్వ్కాడ్ ఇదే..?
ఐపీఎల్ 2026 ముగిసిన వెంటనే భారత జట్టు ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలకు వెళ్లనుంది. ఈ నేపథ్యంలో సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినిస్తూ, యువ రక్తాన్ని ప్రోత్సహించాలని బీసీసీఐ భావిస్తోంది. ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ స్థానంలో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా రావడం, మెరుపు ఫామ్‌లో ఉన్న అభిషేక్ శర్మ జట్టులోకి చేరడం ఇప్పుడు క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ప్రస్తుత ఐపీఎల్ సీజన్ చివరి దశకు చేరుకోవడంతో బీసీసీఐ భవిష్యత్తు సిరీస్‌లపై దృష్టి సారించింది. జూన్ 26 నుంచి ప్రారంభమయ్యే యునైటెడ్ కింగ్‌డమ్ పర్యటన కోసం సరికొత్త టీమ్ ఇండియానూ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధాన ఆటగాళ్లు కొందరు శ్రీలంకలో జరిగే ముక్కోణపు సిరీస్‌లో భారత్ ఏ జట్టు తరపున ప్రాతినిధ్యం వహిస్తుండటంతో, ఐర్లాండ్, ఇంగ్లాండ్ సిరీస్‌లకు ప్రత్యామ్నాయ జట్టును ఎంపిక చేయనున్నారు. ఈ జట్టులో యువ సంచలనం అభిషేక్ శర్మకు చోటు దక్కడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.
శ్రేయస్ అయ్యర్ చేతికి సారథ్య బాధ్యతలు..
దాదాపు మూడేళ్ల తర్వాత టీ20 జట్టులోకి పునరాగమనం చేయడమే కాకుండా, శ్రేయస్ అయ్యర్ ఈ పర్యటనలో జట్టును ముందుండి నడిపించే అవకాశం ఉంది. సూర్యకుమార్ యాదవ్ స్థానంలో అతడిని పొట్టి ఫార్మాట్ కెప్టెన్‌గా నియమించే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఇక బ్యాటింగ్ విభాగంలో సంజూ శామ్సన్, సాయి సుదర్శన్ వంటి నిలకడైన ఆటగాళ్లతో పాటు, ఐపీఎల్ 2026లో అదరగొట్టిన అంగ్క్రిష్ రఘువంశీ, నమన్ ధీర్ తొలిసారి భారత జట్టు తరపున ఎంపికయ్యే అవకాశం ఉంది.
తెలుగు తేజం నితీష్ రెడ్డికి మరో అవకాశం..
ఆల్‌రౌండర్ల విభాగంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి తన సత్తా చాటుతున్నాడు. బౌలింగ్‌లోనూ రాణిస్తూ కీలక వికెట్లు తీస్తున్న నితీష్‌తో పాటు వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ జట్టుకు సమతుల్యతను అందించనున్నారు. ముఖ్యంగా నితీష్ రెడ్డి ప్రదర్శనపై సెలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించారు.
భువనేశ్వర్ కుమార్ గ్రాండ్ రీఎంట్రీ..?
బౌలింగ్ విభాగంలో సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ తిరిగి జట్టులోకి రావొచ్చని తెలుస్తోంది. 2022 తర్వాత మళ్లీ భారత జట్టు జెర్సీని ధరించే ఛాన్స్ ఉంది. ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో 12 ఇన్నింగ్స్‌ల్లోనే 22 వికెట్లు తీసి పాత రోజులను గుర్తు చేస్తున్నాడు. అతడితో పాటు మహమ్మద్ సిరాజ్, రవి బిష్ణోయ్, కార్తీక్ త్యాగి, లక్నో పేసర్ ప్రిన్స్ యాదవ్ బౌలింగ్ బాధ్యతలు పంచుకునే ఛాన్స్ ఉంది.
