Hyderabad: పైకి చూస్తే ప్యామిలీ సెలూన్.. లోపలికి జరిగే మ్యాటర్ మామూలుగా లేదుగా..
గుట్టుచప్పుడు కాకుండా సలూన్ ముసుగులో జరుగుతున్న వ్యభిచారం నడుపుతున్న ముఠాను హైదరాబాద్ ఎస్‌ఓటీ పోలీసులు పట్టుకున్నారు. కచ్చితమైన సమాచారంతో అత్తాపూర్‌లోని హనీష్ ఫ్యామిలీ హెయిర్ సలూన్‌పై ఆకస్మికంగా దాడి చేసి పోలీసులు కొందరు ట్రాన్స్‌జెండర్లను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రంగారెడ్డి జిల్లాలోని అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సలూన్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ఘటన వెలుగులోకి రావడం స్థానికంగా కలకలం రేపింది. విశ్వసనీయ సమాచారం ఆధారంగా ఎస్ఓటీ పోలీసులు ఆకస్మికంగా దాడులు నిర్వహించగా, అనుమానాస్పద పరిస్థితుల్లో కొందరు ట్రాన్స్‌జెండర్లు ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
పోలీసుల వివరాల ప్రకారం.. అత్తాపూర్ ప్రాంతంలోని హనీష్ ఫ్యామిలీ హెయిర్ సలూన్లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారం ఎస్ఓటీ బృందానికి అందింది. దీంతో అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, అనంతరం సలూన్‌పై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. తనిఖీల సమయంలో అక్కడ అనుమానాస్పదంగా కొందరు వ్యక్తులు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు వారిని రెడ్ హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.
ప్రాథమిక విచారణలో, సలూన్‌ను కేవలం హెయిర్ కటింగ్ సెంటర్‌గా కాకుండా వ్యభిచార కార్యకలాపాలకు కేంద్రంగా ఉపయోగిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఘటన స్థలంలో లభ్యమైన ఆధారాలు, అక్కడికి వచ్చిన వ్యక్తుల వివరాలు, ఫోన్ కాల్ డేటా తదితర సమాచారాన్ని పోలీసులు సేకరిస్తున్నారు.
ఈ వ్యవహారం వెనుక మరెవరైనా ఉన్నారా? నిర్వాహకులు ఎవరనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతోంది.ఈ ఘటనపై అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి పూర్తి స్థాయి విచారణ ప్రారంభించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
