AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. ఆగ‌స్టు నెల దర్శన టికెట్ల కోటా విడుదల! ఇదిగో పూర్తి వివరాలు

తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక సమాచారం అందించింది. 2026 ఆగస్టు నెలకు సంబంధించిన ఆర్జిత సేవా సహా వివిధ రకాల దర్శన టికెట్లు, వసతి గదుల ఆన్‌లైన్ కోటా విడుదల షెడ్యూల్‌ను శనివారం టీటీడీ అధికారికంగా ప్రకటించింది. కాబట్టి ఆయా తేదీలు, సమయాల వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. ఆగ‌స్టు నెల దర్శన టికెట్ల కోటా విడుదల! ఇదిగో పూర్తి వివరాలు
Ttd August Month Quota 2026
Anand T
|

Updated on: May 17, 2026 | 6:49 AM

Share

శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల( సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ) కు సంబంధించిన కోటాను మే 18న ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని పేర్కొంది. ఈ టికెట్లు పొందిన వారు 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి టికెట్లు మంజూరవుతాయి.

21న ఆర్జిత సేవా టికెట్ల విడుదల

ఇక కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, సాలకట్ల పవిత్రోత్సవాల టికెట్లను 21న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయ‌నుంది. అదే విధంగా వార్షిక పవిత్రోత్సవాల (23-08-26 నుండి 25-08-26) టికెట్లను కూడా మే 21 ఉదయం 10గంటలకు ఆన్లైన్‌లో విడుదల చేయనున్నారు. ఇక అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు మరియు వాటికి సంబంధించిన దర్శన స్లాట్ల కోటాను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతారు.

23న అంగ ప్రదక్షిణ టోకెన్లు విడుదల

ఇక 23వ తేదీన ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టోకెన్ల కోటా, ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటా విడుదల చేస్తారు. ఇక మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారి కోసం కేటాయించే ఉచిత ప్రత్యేక దర్శన టోకెన్ల కోటాను విడుదల చేస్తారు.

25న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల

ఇక మే 25వ తేదీన ఉదయం 10 గంటలకు రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన (SSD) టికెట్ల కోటాను, మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలలో భక్తుల వసతి కోసం గదుల కోటాను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతారు.

భక్తులకు ముఖ్య గమనిక

భక్తులు శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు మరియు వసతి గదులను కేవలం టీటీడీ అధికారిక వెబ్‌సైట్ https://ttdevasthanams.ap.gov.in ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలని, నకిలీ వెబ్‌సైట్లను నమ్మి మోసపోవద్దని టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారి విజ్ఞప్తి చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us