AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కష్టపడి 9 నెలల్లో 10 కిలోల బరువు తగ్గా.. సర్జరీ చేయించుకున్నావా అంటున్నారు.. స్టార్ హీరోయిన్ ఆవేదన

సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే బాడీ ఫిట్​గా ఉండాల్సిందే. అది హీరోలైనా, హీరోయిన్లైనా. అందుకే హీరోహీరోయిన్లందరూ వ్యాయామం, యోగా, డైట్​ వంటి వాటిని వారి డైలీరొటీన్​లో తప్పకుండా ఉండేలా జాగ్రత్తపడతారు. అయినప్పటికీ జీన్స్​ కారణంగా, వయస్సు రీత్యా, ఆరోగ్య సమస్యల మూలంగా కొందరు సెలబ్రిటీలు అధిక బరువు సమస్యను ఎదుర్కొంటారు.

కష్టపడి 9 నెలల్లో 10 కిలోల బరువు తగ్గా.. సర్జరీ చేయించుకున్నావా అంటున్నారు.. స్టార్ హీరోయిన్ ఆవేదన
Actress
Rajeev Rayala
|

Updated on: May 17, 2026 | 7:06 AM

Share

సినిమా ఇండస్ట్రీలో పాత్రల కోసం రూపురేఖలు మార్చుకున్న వారు ఎంతో మంది ఉన్నారు. సినిమాల్లో పాత్ర డిమాండ్ చేస్తే బరువు పెరగడం, లేదా తగ్గడం లాంటివి చేస్తున్నారు. చాలా వరకు హీరోలే ఇలాంటి సాహసాలు చేస్తుంటారు. కొంతమంది హీరోయిన్స్ కూడా పాత్రల కోసం బరువు పెరగడం తగ్గడం వంటివి చేస్తుంటారు. హీరోయిన్స్ చాలా మంది ఫిట్ నెస్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతూ ఉంటారు. సినిమాలకు తగ్గట్టుగా శరీర ఆకృతిని మార్చుకుంటూ ఉంటారు. పాత్రలు డిమాండ్ చేస్తే దానికి తగ్గట్టుగా మారిపోతూ ఉంటారు. ఇక ఫిట్ నెస్ కోసం జిమ్‌లో తెగ కష్టపడుతూ ఉంటారు. అయితే కొంతమంది హీరోయిన్స్ బరువు తగ్గడం కోసం సర్జరీలు చేయించుకుంటూ ఉంటారు. తాజాగా ఓ హీరోయిన్ కూడా బరువు తగ్గడం కోసం సర్జరీ చేయించుకుందని వార్తలు వచ్చాయి. ఆ రూమర్స్ కు ఆ బ్యూటీ అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది.

ఇది కూడా చదవండి :RK Roja: ఒక్కహీరో కూడా నాకు లవ్ ప్రపోజ్ చేయలేదు.. కారణం ఏంటో చెప్పిన రోజా

ఆమె ఎవరో కాదు అందాల భామ కీర్తిసురేష్.. తమిళ్ ఇండస్ట్రీ నుంచి తెలుగులోకి అడుగుపెట్టింది ఈ అమ్మడు. నేను శైలజ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసింది. ఇక మహానటి సినిమాతో తెలుగులో ప్రేక్షకులకు మరింత దగ్గరైయింది ఈ ముద్దుగుమ్మ. ఆతర్వాత స్టార్ హీరోల సినిమాల్లో నటించింది కీర్తిసురేష్. ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ అందాల భామ. గత ఏడాది పెళ్లి చేసుకొని అభిమానులకు షాక్ ఇచ్చింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : మూడు పెళ్లిళ్లు చేసుకొని తప్పు చేశా.. టైం అంతా వేస్ట్.. ఇప్పుడు బుద్దొచ్చింది

పెళ్లి తర్వాత కీర్తిసురేష్ సినిమాల స్పీడ్ తగ్గించింది. ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా మారనుంది. ఇదిలా ఉంటే ఇటీవల కీర్తిసురేష్ కాస్త బొద్దుగా మారింది.. ఆతర్వాత ఈ ముద్దుగుమ్మ రీసెంట్ గా సన్నజాజిగా మారి అందరిని షాక్ కు గురి చేసింది. అయితే బరువు తగ్గడం కోసం కీర్తిసురేష్ సర్జరీ చేయించుకుందని కొంతమంది ట్రోల్స్ చేశారు. సోషల్ మీడియాలో కీర్తి సర్జరీ చేయించుకుంది అంటూ ప్రచారం జరగడంతో ఆ వార్తలకు కౌంటర్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్న వీడియోను షేర్ చేసి ట్రోలర్స్ నోరు మూయించింది. 2013లో నటిగా కెరీర్ ప్రారంభించినప్పుడు ఫిట్‌నెస్‌ గురించి నాకు పెద్దగా ఏం తెలియదు లేదు. జిమ్ నా వల్ల కాదు అనుకునేదాన్ని. 2018లో ‘మహానటి’ చేసిన తర్వాత కాస్త గ్యాప్ దొరకడంతో ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాలనుకున్నా. కరెక్ట్ వర్కౌట్స్, డైట్ చేసి 9 నెలల్లో 10 కిలోల బరువు తగ్గాను. కానీ నేను ఇంత కష్టపడితే కొందరు మాత్రం బలహీనంగా కనిపిస్తున్నావు, సర్జరీలు చేయించుకున్నావా అని అన్నారు. అది నాకు ఆవేదన కలిగించింది అంటూ రాసుకొచ్చింది కీర్తి . అలాగే నా చిన్నప్పుడు కాస్త లావుగా ఉన్నానని సన్నబడమని చెప్పినవాళ్లే.. ఇప్పుడు సన్నబడిన తర్వాత గతంలోనే బాగున్నావని అంటున్నారు. అసలు ప్రపంచం ఎలా ఆలోచిస్తుందో అర్థం కావట్లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది కీర్తిసురేష్..

ఇది కూడా చదవండి :భర్తను దర్శకుడిని చేద్దాం అనుకుంది.. కానీ బెడిసికొట్టింది.. సంపాదించిందంతా పోగొట్టుకొని చివరకు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us