AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Folk song: ఏముంది మావ సాంగ్.. వినేకొద్ది వినాలనిపిస్తుంది.. కుర్రాళ్లు తెగ పాడుకుంటున్న పాట

స్మార్ట్‌ఫోన్ చేతిలోకి వచ్చాక, సోషల్ మీడియా పుణ్యమా అని ‘జానపదం’ గ్లోబల్ రేంజ్‌లో మోత మోగిస్తోంది. ముఖ్యంగా యూట్యూబ్‌లో ప్రస్తుతం వస్తున్న ఫోక్ సాంగ్స్ మిలియన్ల కొద్దీ వ్యూస్‌ను కొల్లగొడుతూ, పెద్ద పెద్ద సినిమా పాటలకు సైతం గట్టి పోటీనిస్తున్నాయి .

Folk song: ఏముంది మావ సాంగ్.. వినేకొద్ది వినాలనిపిస్తుంది.. కుర్రాళ్లు తెగ పాడుకుంటున్న పాట
Folk Song
Rajeev Rayala
|

Updated on: May 14, 2026 | 12:19 PM

Share

సినిమా పాటలే కాదు ప్రస్తుతం ఎక్కడ చూసిన ఫోక్ సాంగ్స్ ఊపేస్తున్నాయి. అకేషన్ ఏదైనా ఫోక్ సాంగ్స్ ఉండాల్సిందే. చిన్న పెద్ద అని తేడా లేకుండా సాంగ్స్ కు విపరీతంగా వైబ్ అవుతున్నారు జనాలు. అలాగే ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఎన్నో రకాల ఫోక్ సాంగ్స్ తెరకెక్కిస్తున్నారు. ఇటీవల విడుదలైన సాంగ్స్ సినిమా సాంగ్స్ కు మించి క్రేజ్ సొంతం చేసుకుంటున్నాయి. యూట్యూబ్ లో మిలియన్స్ వ్యూస్ సొంతం చేసుకుంటూ రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి. అంతే కాదు కొన్ని సాంగ్స్ ఏకంగా పాన్ ఇండియా రేంజ్ లో హిట్ అవుతున్నాయి. విదేశాల్లోనూ మన పాటలకు స్టెప్పులేస్తున్నారు సాంగ్ లవర్స్.

ఇది కూడా చదవండి : ఆ హీరో నాకు గంటసేపు క్లాస్ క్లాస్ తీసుకున్నాడు.. ఆయన మాటలు ఒక ఇంజెక్షన్‌లా పని చేశాయి

ఇక తెలంగాణ ఫోక్ సాంగ్స్ కు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ వస్తుంది. ఇప్పటికే రాను బొంబాయికి రాను సాంగ్, ఓ పిలగ వెంటేశు,  అలాగే మరికొన్ని సాంగ్స్ భారీ వ్యూస్ సొంతం చేసుకున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో ఫోక్ సాంగ్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఈ సాంగ్ చాలా పాపులర్ అయ్యింది. ఎక్కడ చూసిన ఇదే సాంగ్ వినిపిస్తుంది. ఈ సాంగ్ వచ్చి 11 నెలలు అవుతుంది. ఇప్పటికీ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది. ఎంతోమంది ఈ సాంగ్ కు వీడియోలు చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి : బాబోయ్.. ఇదెక్కడి రొమాంటిక్ సిరీస్ రా బాబు..! ప్రపంచవ్యాప్తంగా 240కి పైగా దేశాల్లో స్ట్రీమింగ్

ఈ సాంగ్ పేరు రింగు రింగుల జుట్టుదానా.. ఈ సాంగ్ ఇప్పటికే 84 మిలియన్ కు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది. ఈ సాంగ్ ను రాను బొంబాయికి రాను ఫేమ్ రాము రాథోడ్, ప్రభ ఆలపించారు. అలాగే రాము రాథోడ్ , లిఖిత డాన్స్ అదరగొట్టారు. ఈ సూపర్ ఫోక్ సాంగ్ కు కళ్యాణ్ కీస్ మ్యూజిక్ అందించాడు. సురేష్ గంగుల, దేవ్ పవర్ సాహిత్యం అందించారు. ఈ సాంగ్ ఇప్పుడు యూట్యూబ్ ను ఊపేస్తోంది.. ఈ సాంగ్ పై మీరూ ఓ లుక్కేయండి.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : 14ఏళ్లకే ఎంట్రీ.. పెళ్ళైన దర్శకుడితో ఎఫైర్.. కట్ చేస్తే ఫ్యాన్‌కు ఉరేసుకొని..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us