AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాన్న ఉన్నా లేనట్టే.. అమ్మకు అన్నం కూడా పెట్టలేదు..! నేను ఒంటరిగానే పోరాడుతున్నా

సినిమా ఇండస్ట్రీలో రాణిస్తున్న చాలా మంది రియల్ లైఫ్ లో ఎన్నో ఇబ్బందులు ఎదుకున్నారు.. కెరీర్ బిగినింగ్ లో కష్టాలు, సవాళ్లు ఎదుర్కొని ఇప్పుడు ఉన్నత స్థాయిలో రాణిస్తున్నారు చాలా మంది ముద్దుగుమ్మలు.. వారిలో ఈ చిన్నది ఒకరు.. ఈ యాంకర్ ఎన్నో కష్టాలను చూసింది.

నాన్న ఉన్నా లేనట్టే.. అమ్మకు అన్నం కూడా పెట్టలేదు..! నేను ఒంటరిగానే పోరాడుతున్నా
Actress
Rajeev Rayala
|

Updated on: May 08, 2026 | 4:25 PM

Share

గ్లామరస్ ఫీల్డ్ లో రాణిస్తున్న ఎంతో మంది హీరోయిన్ కెరీర్ బిగినింగ్ లో లేదా వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుకున్నారు ఎన్నో కష్టాలను, సవాళ్ళను ఎదుర్కొని ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ డమ్ సొంతం చేసుకున్నారు. జీవితంలో పడరాని కష్టాలు పడి.. ఇప్పుడు ఉన్నత స్థాయిలో ఉన్నారు. కేవలం హీరోయిన్స్ మాత్రమే కాదు క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు, యాంకర్స్, కమెడియన్స్ కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకున్న భామ కూడా నటిగా, యాంకర్ గా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. సీరియల్స్ ద్వారా నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ చిన్నది ఆతర్వాత యాంకర్ గా మారి తన క్యూట్ మాటలతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఆమె ఎవరో కాదు అందాల భామ సౌమ్య రావు. జబర్దస్త్ ద్వారా యాంకర్ గా మారింది సౌమ్య.  కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ చిన్నది తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఇది కూడా చదవండి : బీటెక్ మధ్యలో వదిలేసింది.. రూ. 500తో వచ్చి రూ.100కోట్ల ఆస్తుపాస్తులు సంపాదించింది

సౌమ్య రావు గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనజీవితంలో ఎదుర్కున్న కష్టాలను పంచుకుంది. తన తల్లి అనారోగ్యం, ఆమె పడిన కష్టాలు ఆమెకు చాలా భావోద్వేగాలను కలిగిస్తాయని చెప్పారు. ఒక కూతురిగా తన తల్లిని అంతటి కష్టమైన పరిస్థితులలో చూడడం అత్యంత బాధాకరమని ఆమె పేర్కొన్నారు. తల్లిదండ్రుల కష్టకాలంలో వారిని చూసుకోవడం నిజమైన ప్రేమకు నిదర్శనమని ఆమె అభిప్రాయపడ్డారు. ఆమె తల్లి ఆరోగ్యం క్షీణించినప్పుడు, ఆమె షూటింగ్‌లలో ఉండటం వల్ల ఒక హోమ్ నర్సును నియమించా.. అయితే, ఆ నర్సు మోసం చేసింది.. తల్లికి ఫుడ్ పైప్ ద్వారా అందించాల్సిన ఆహారం కోసం ఇచ్చే డబ్బులు తీసుకుని, 700 రూపాయల విలువైన నాలుగు రోజుల పౌడర్ ఫుడ్‌ను కూడా ఇవ్వలేదని తెలిసింది. 15 రోజుల పాటు తల్లికి సరైన ఆహారం అందలేదని, ఆహారపు డబ్బులను నర్సు స్వయంగా తీసుకుందని ఒక మెడికల్ షాప్ నుండి సమాచారం వచ్చినప్పుడు ఆమె తీవ్రంగా కలత చెందా అని తెలిపింది. బెడ్‌పై ఉండి, మాట్లాడలేని స్థితిలో ఉన్నవారి ఆహారాన్ని కూడా దొంగిలించే దౌర్భాగ్యులు సమాజంలో ఉన్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సంఘటన ఆమెను మానసికంగా బాగా కుంగదీసింది, “15 రోజులు ఎలా వదిలేసి వెళ్ళిపోయాను, ఇది కూడా చూసుకోలేకపోతున్నానా?” అని బాధపడ్డా అని తెలిపింది సౌమ్య.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :OTT Movie : హైవేపై వరుసగా ప్రమాదాలు.. కట్ చేస్తే ట్విస్ట్.. ఓటీటీని షేక్ చేస్తున్న థ్రిల్లర్..

తన తండ్రి గురించి ప్రస్తావిస్తూ, ఆయన ఉన్నా లేనట్టే అని తెలిపింది సౌమ్య. ఆయనకు చెడు అలవాట్లు ఎక్కువగా ఉన్నాయని, ముఖ్యంగా మద్యపానానికి బానిసయ్యారని చెప్పుకొచ్చింది. ఆయనకు కుటుంబం పట్ల ఎలాంటి బాధ్యత లేదని, కూతురి వివాహం, విద్య, సంరక్షణ వంటి విషయాలపై ఎప్పుడూ శ్రద్ధ చూపలేదని ఆమె తెలిపింది. కనీసం ప్రేమ, ఆప్యాయతను కూడా అందించలేకపోయారని, అందుకే ఆయనతో ఆమెకు పెద్దగా అనుబంధం లేదని చెప్పారు. ప్రస్తుతం ఆమె తండ్రి బెంగళూరుకు 300 కిలోమీటర్ల దూరంలో ఒక గ్రామంలో నివసిస్తున్నారని, ప్రతి మూడు, నాలుగు నెలలకోసారి కలుస్తుంటారని, ఆ కలిసినప్పుడు కూడా డబ్బుల కోసమే వస్తారని తెలిపింది. ఆమె నెలకు కొంత మెయింటెనెన్స్ ఇస్తున్నప్పటికీ, వారితో ఎక్కువ కాంటాక్ట్ ఉండదని ఆమె స్పష్టం చేశారు. ఆమెకు తోబుట్టువులు లేరని, జీవితంలో ఒక్కదాన్నే  పోరాడుతున్నానని సౌమ్య తెలిపింది.

ఇది కూడా చదవండి : బికినీ వేసుకోమని ఫోర్స్ చేశాడు.. 19ఏళ్ల వయసులోనే క్యాస్టింగ్ కౌచ్ బారిన పడ్డాను

View this post on Instagram

A post shared by Sowmya Rao (@sowmya.sharada)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us