పరమ చెత్త సినిమా.. రూ. 14000కోట్లుపెడితే రూ. 6కోట్లు వచ్చింది.. ఇండస్ట్రీలోనే బిగెస్ట్ డిజాస్టర్ మూవీ
రీసెంట్ డేస్ లో పాన్ ఇండియా సినిమాల హావ నడుస్తుంది. ఏ ఇండస్ట్రీ చూసినా పాన్ ఇండియా సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే అన్ని భారీ బడ్జెట్ సినిమాలు తెరకెక్కుతున్నాయి. అయితే భారీ అంచనాల మధ్య విడుదలైన సినిమాలు ఊహించని విధంగా కొన్ని బోల్తాకొడుతుంటాయి.

ఏ సినిమా ఎప్పుడు ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చెప్పడం చాలా కష్టం. ఎంత పెద్ద సినిమా అయినా.. భారీ బడ్జెట్ పెట్టిన అది ప్రేక్షకులను మెప్పించలేకపోతో డిజాస్టర్ ఖాయం. ఇప్పటికే చాలా సినిమాల విషయంలో ఇది జరిగింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన పెద్ద సినిమాలు భారీ విజయాలను అందుకుంటున్నాయి. పాన్ ఇండియా లెవల్ లో హిట్ అవుతున్నాయి. కలెక్షన్స్ విషయంలోనూ దుమ్మురేపుతున్నాయి. కానీ కొన్ని బడా సినిమాలు మాత్రం బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నాయి. భారీ బడ్జెట్, పెద్ద హీరోలు, హీరోయిన్స్, పాన్ ఇండియా లెవల్ లో ప్రమోషన్స్ చేసినా కూడా సినిమాలు ప్రేక్షకులను నిరాశపరుస్తున్నాయి. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా డబుల్ డిజాస్టర్ సినిమా.. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కించి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.
ఇది కూడా చదవండి : Banerjee: ఎవరైనా ఆ హీరో బయోపిక్ తీయాలి.. ఎన్నో కష్టాలు, సవాళ్లు ఎదుర్కున్నాడు..
భారీ అంచనాల మధ్య థియేటర్ లో విదులైన ఈ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ అయ్యింది. రూ . 1400కోట్లు పెట్టి సినిమా తీస్తే కేవలం రూ. 6కోట్లు మాత్రమే వచ్చాయి. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అత్యధిక నష్టాలను మూటగట్టుకున్న సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా పేరు డెజర్ట్ వారియర్. ఈ సినిమాను సౌదీ అరేబియా MBC గ్రూప్ నిర్మించింది. ఈ సినిమాకు రైజ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ ఫేమ్ రూపెర్ట్ వ్యాట్ దర్శకత్వం వహించారు.
ఇది కూడా చదవండి :లేటుగా వచ్చాడని ఆ స్టార్ హీరోని రోజంతా ఎండలో నిలబెట్టారు.. ఇప్పుడు ఆయన ఇండస్ట్రీలో పెద్ద స్టార్
ఇక ఈ సినిమాలో కొత్త మర్వెల్ కెప్టెన్ అమెరికా ఆంథోనీ మాకీ, ఆస్కార్ విజేత బెన్ కింగ్స్లీ, ఐషా హార్ట్, షార్ల్టో కోప్లీ లాంటి స్టార్లు నటించారు. ఈ సినిమాను సుమారు రూ.1400 కోట్లుతో తెరకెక్కించారు. భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 2026లో అంతర్జాతీయంగా విడుదలైన ఈ సినిమా.. కనీస ఓపెనింగ్స్ కూడా రాబట్టలేకపోయింది. మొదటి షో నుంచి డిజాస్టర్ టాక్ మూటగట్టుకుంది. ఏకంగా 99.6% పెట్టుబడి నష్టపోయింది. సినిమా ఇండస్ట్రీలోనే పరమ చెత్త సినిమాగా నిలిచింది ఈ సినిమా..
ఇది కూడా చదవండి : వార్ని..! విజయ్‌తో ఉన్న ఈ చిన్నారి.. ఎన్టీఆర్, అల్లు అర్జున్‌తో బ్లాక్ బస్టర్స్ అందుకుంది
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




