AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓలాను వెనక్కినెట్టిన టీవీఎస్..! ఎలక్ట్రిక్‌ టూ వీలర్ల అమ్మకాల్లో రికార్డు.. పూర్తి వివరాలివే

భారత ఎలక్ట్రిక్ టూ-వీలర్ వెహికల్ మార్కెట్ జూలై 2026లో సరికొత్త రికార్డును సృష్టించింది. దేశ చరిత్రలో తొలిసారిగా ఒకే నెలలో రెండు లక్షలకు పైగా ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్‌లు అమ్ముడయ్యాయి. వేగంగా విస్తరిస్తున్న ఈవీ మార్కెట్‌కు సంబంధించిన ఆసక్తికరమైన గణాంకాలను తెలుసుకుందాం.

ఓలాను వెనక్కినెట్టిన టీవీఎస్..! ఎలక్ట్రిక్‌ టూ వీలర్ల అమ్మకాల్లో రికార్డు.. పూర్తి వివరాలివే
Two Wheeler Market Crosses 2 Lakh Units In July 2026 With Tvs
Nikhil
|

Updated on: Aug 07, 2026 | 6:50 AM

Share

గత ఏడాదితో పోలిస్తే ఏకంగా 56 శాతం వృద్ధిని నమోదు చేసుకున్న ఆటోమొబైల్ రంగంలో సరికొత్త సంచలనాలు నమోదవుతున్నాయి. ప్రముఖ కంపెనీల మధ్య తీవ్ర పోటీ నెలకొన్న ఈ తరుణంలో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం!

రికార్డు అమ్మకాలు..

భారత ఎలక్ట్రిక్ టూ-వీలర్ వెహికల్ మార్కెట్ జూలై 2026లో కొత్త రికార్డు సృష్టించింది. తొలిసారిగా ఒకే నెలలో రెండు లక్షలకు పైగా ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్‌లు అమ్ముడయ్యాయి. జూలైలో మొత్తం 2,04,266 ఎలక్ట్రిక్ టూ-వీలర్లు రిటైల్ అమ్మకాలు రికార్డు అయ్యాయి. మార్చి 2026లో నమోదైన ఈవీ స్కూటర్ల రికార్డు ఈ నెల బ్రేక్ అయ్యింది. ఈ ఏడాది జనవరి నుంచి జూలై వరకు మొత్తం 11.7 లక్షల ఎలక్ట్రిక్ టూ-వీలర్స్ అమ్ముడయ్యాయి.

గత ఏడాదితో పోలిస్తే ఏకంగా 56 శాతం ఎక్కువ. 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలల్లోనే 7.29 లక్షలకు పైగా యూనిట్లు అమ్ముడు కావడంతో, ఈవీ మార్కెట్ వేగంగా విస్తరిస్తున్నట్లు అర్థం అవుతోంది. జూలైలో టీవీఎస్ మోటార్ అత్యధిక అమ్మకాలతో టాప్ ప్లేస్‌లో నిలిచింది. కంపెనీ 55,477 ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్లను అమ్మి చరిత్రలోనే అత్యధిక నెలవారీ అమ్మకాలను నమోదు చేసింది.

గత ఏడాదితో పోలిస్తే టీవీఎస్ అమ్మకాలు 135 శాతం పెరిగాయి. దీంతో కంపెనీ మార్కెట్ వాటా 27 శాతానికి చేరుకుంది. ప్రస్తుతం ఐక్యూబ్‌తో పాటు కంపెనీ ఇతర ఎలక్ట్రిక్ మోడళ్లకు కూడా మంచి డిమాండ్ కనిపిస్తోంది. రెండో స్థానంలో బజాజ్ ఆటో నిలిచింది. కంపెనీ జూలైలో 45,592 చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్లను అమ్మింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 122 శాతం వృద్ధిని సాధించింది.

కొత్తగా విడుదలైన చేతక్ మోడల్‌కు కూడా వినియోగదారుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. మూడో స్థానంలో ఏథర్ ఎనర్జీ ఉంది. ఈ కంపెనీ జూలైలో 30,323 యూనిట్లు విక్రయించింది. గత ఏడాదితో పోలిస్తే 70 శాతం వృద్ధిని సాధించింది. ఇటీవల మోడళ్లలో బ్యాటరీ అప్‌డేట్లు చేసిన ఏథర్, ఈ నెల చివర్లో మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కూడా విడుదల చేయడానికి సిద్ధమవుతోంది.

విడా దూకుడు

హీరో మోటోకార్ప్‌కు చెందిన విడా కూడా జూలైలో కొత్త రికార్డు నమోదు చేసింది. కంపెనీ 22,887 యూనిట్లు అమ్మి, ఇప్పటి వరకు అత్యధిక నెలవారీ అమ్మకాలను సాధించింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 111 శాతం వృద్ధి సాధించడం విశేషం. ఇటీవల విడుదల చేసిన కొత్త సిరీస్ మోడళ్లు విడా అమ్మకాల పెరుగుదలకు మంచి బూస్టింగ్ లభించింది. ఒకప్పుడు మార్కెట్‌లో అగ్రస్థానంలో ఉన్న ఓలా ఎలక్ట్రిక్ మాత్రం ఈసారి వెనుకబడింది. జూలైలో కంపెనీ 14,105 యూనిట్లు మాత్రమే అమ్మింది. గత ఏడాదితో పోలిస్తే 24 శాతం తగ్గుదల కనబరిచింది. దీంతో ఓలా మార్కెట్ వాటా 17 శాతం నుంచి 7 శాతానికి పడిపోయింది.

భవిష్యత్ అంచనాలు

దేశంలో పర్యావరణ హితమైన రవాణాపై ప్రజల్లో అవగాహన పెరుగుతుండటంతో ఎలక్ట్రిక్ టూ-వీలర్లకు ఆదరణ ఊహించని స్థాయిలో పెరిగిపోతోంది. రాబోయే పండుగ సీజన్లలో ఈ అమ్మకాలు మరింత జోరందుకునే అవకాశం ఉందని ఆటోమొబైల్ నిపుణులు అంచనా వేస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరుస్తూ సరికొత్త ఫీచర్లతో వస్తున్న ఈ వాహనాలు వినియోగదారుల దైనందిన ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తున్నాయి. సాంప్రదాయ వాహనాల నుంచి ఈవీల వైపు వినియోగదారులు మళ్లుతుండటంతో రానున్న రోజుల్లో ఆటోమొబైల్ మార్కెట్ ముఖచిత్రం పూర్తిగా మారిపోనుందనడంలో సందేహం లేదు.

Follow Us