AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యాప్స్‌ అప్‌డేట్ ఎందుకు చేయాలి..? మీరు చేస్తే ఈ తప్పులతో మీ ఫోన్ హ్యాకర్ల చేతుల్లోకి..

మీ ఫోన్ తరచూ హ్యాంగ్ అవుతోందా? యాప్స్ సడన్‌గా క్లోజ్ అయిపోతున్నాయా? దీనికి కారణం మీ ఫోన్‌లో పేరుకుపోయిన పాత వెర్షన్ యాప్‌లే కావచ్చు. ఫోన్ స్పీడ్‌గా పనిచేయాలన్నా, హ్యాకర్ల బారిన పడకుండా ఉండాలన్నా యాప్ అప్‌డేట్స్ ఎందుకు అత్యవసరమో ప్రతి స్మార్ట్‌ఫోన్ యూజర్ తెలుసుకోవాల్సిన వాస్తవాలు ఇవే.

యాప్స్‌ అప్‌డేట్ ఎందుకు చేయాలి..? మీరు చేస్తే ఈ తప్పులతో మీ ఫోన్ హ్యాకర్ల చేతుల్లోకి..
Why Should You Update Apps
Krishna S
|

Updated on: Aug 24, 2026 | 1:42 PM

Share

నేటి డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్ నిత్యావసరంగా మారింది. షాపింగ్, బ్యాంకింగ్ లావాదేవీలు, చదువు, వినోదం ఇలా ప్రతి అవసరానికి వేర్వేరు యాప్‌లను వాడుతున్నాం. అయితే చాలా మంది ఫోన్‌లో యాప్ అప్‌డేట్ నోటిఫికేషన్ రాగానే దాన్ని పక్కకు నెట్టేస్తుంటారు లేదా వాయిదా వేస్తుంటారు. యాప్ బాగానే పనిచేస్తుంది కదా.. ఇప్పుడే అప్‌డేట్ చేయడం ఎందుకు?’’ అని భావిస్తుంటారు. కానీ ఈ చిన్న నిర్లక్ష్యం మీ వ్యక్తిగత డేటా భద్రతను, ఫోన్ పనితీరును తీవ్ర ప్రమాదంలో పడేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. డెవలపర్లు లేదా టెక్ కంపెనీలు తాము రూపొందించిన యాప్‌ను మరింత మెరుగ్గా మార్చేందుకు విడుదల చేసే సరికొత్త వెర్షన్‌నే యాప్ అప్‌డేట్ అంటారు. వినియోగదారుల నుంచి వచ్చే ఫీడ్‌బ్యాక్ ఆధారంగా పాత సమస్యలను సరిదిద్దడం, కొత్త ఫీచర్లను జోడించడం, యూజర్ ఇంటర్‌ఫేస్ డిజైన్‌ను ఆకర్షణీయంగా మార్చడం వంటి మార్పులు ఈ అప్‌డేట్ల ద్వారా జరుగుతాయి.

భద్రతా లోపాలకు చెక్

యాప్‌లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయడంలో అత్యంత కీలకమైన అంశం భద్రత. పాత వెర్షన్లలో ఉండే సెక్యూరిటీ లొసుగులను ఆసరాగా చేసుకుని హ్యాకర్లు, సైబర్ నేరగాళ్లు మీ బ్యాంకింగ్ వివరాలు, వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేసే ప్రమాదం ఉంది. కంపెనీలు విడుదల చేసే సెక్యూరిటీ ప్యాచ్‌లు ఇలాంటి లోపాలను సరిదిద్ది ఆన్‌లైన్ మోసాల నుంచి రక్షణ కల్పిస్తాయి.

బగ్స్ తొలగింపు.. సూపర్ ఫాస్ట్ పర్ఫార్మెన్స్

యాప్‌లను వాడేటప్పుడు అప్పుడప్పుడు ఫోన్ హ్యాంగ్ అవ్వడం, యాప్ ఉన్నట్టుండి క్లోజ్ కావడం, లేదా నెమ్మదిగా పనిచేయడం వంటి సమస్యలు ఎదురవుతాయి. వీటినే టెక్నికల్ భాషలో బగ్స్ అంటారు. కొత్త అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్ చేయడం ద్వారా ఈ బగ్స్ తొలగిపోయి, యాప్ ఎంతో వేగంగా, స్మూత్‌గా పనిచేస్తుంది.

కొత్త ఫీచర్లు.. మెరుగైన అనుభవం

కేవలం భద్రత మాత్రమే కాకుండా యూజర్లకు సరికొత్త అనుభూతిని అందించే అదనపు టూల్స్, ఆప్షన్లు అప్‌డేట్లతోనే వస్తాయి. కొత్త డిజైన్, సరికొత్త బటన్లు, డార్క్ మోడ్ వంటి సౌకర్యాలు అప్‌డేట్ చేసుకున్నప్పుడే అందుబాటులోకి వస్తాయి.

అందుకే గూగుల్ ప్లేస్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్‌లో అప్‌డేట్ నోటిఫికేషన్ కనిపించినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే అప్‌డేట్ చేసుకోవడం ఉత్తమం. ముఖ్యంగా బ్యాంకింగ్, పేమెంట్స్, సోషల్ మీడియా వంటి కీలక యాప్‌లను ఎప్పటికప్పుడు అప్‌డేటెడ్‌గా ఉంచుకోవడం ద్వారా మీ ఫోన్‌తో పాటు విలువైన డేటాను కూడా సురక్షితంగా కాపాడుకోవచ్చు.

Follow Us