AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

3 లక్షల స్కూటర్లతో హీరో సంచలనం..! విడా ఎలక్ట్రిక్ సేల్స్‌ చూస్తే పిచ్చెక్కిపోతోంది

Hero Vida Electric.. హీరో మోటోకార్ప్‌కు చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ బ్రాండ్ విడా భారత మార్కెట్లో మరో కీలక మైలురాయిని విజయవంతంగా చేరుకుంది. నవంబర్ 2022లో ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు కంపెనీ మొత్తం రిటైల్ అమ్మకాలు మూడు లక్షల మార్క్‌ను దాటాయి. ఈవీ మార్కెట్‌లో సంచలనాలు సృష్టిస్తున్న ఈ ట్రెండింగ్ బ్రాండ్ విశేషాలను తెలుసుకుందాం!

3 లక్షల స్కూటర్లతో హీరో సంచలనం..! విడా ఎలక్ట్రిక్ సేల్స్‌ చూస్తే పిచ్చెక్కిపోతోంది
Hero Motocorps Vida Electric Scooter
Nikhil
|

Updated on: Aug 07, 2026 | 7:00 AM

Share

తొలి లక్ష అమ్మకాలకు సుమారు 33 నెలలు పట్టినప్పటికీ కేవలం ఐదు నెలల్లోనే రెండు లక్షల నుంచి మూడు లక్షలకు చేరుకోవడం విడా స్కూటర్లకు పెరుగుతున్న డిమాండ్‌ను స్పష్టంగా తెలియజేస్తోంది. ఆకర్షణీయమైన ఫీచర్లు, వ్యూహాత్మక విధానాలతో దూసుకెళ్తున్న ఈ ఎలక్ట్రిక్ టూ-వీలర్ పూర్తి వివరాలను తెలుసుకుందాం!

తాజా గణంకాలు..

హీరో మోటోకార్ప్‌కు చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ బ్రాండ్ విడా భారత మార్కెట్లో మరో కీలక మైలురాయిని చేరుకుంది. కంపెనీ మొత్తం రిటైల్ అమ్మకాలు మూడు లక్షల మార్క్‌ను దాటాయి. తాజా గణాంకాల ప్రకారం, నవంబర్ 2022లో మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి 2026 ఆగస్టు 1 వరకు విడా స్కూటర్ల రిటైల్ అమ్మకాలు 3,00,458 యూనిట్లకు చేరాయి. ప్రస్తుతం ఇండియన్ ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్లో విడా వేగంగా ఎదుగుతున్న బ్రాండ్లలో ఒకటిగా నిలిచింది.

మార్కెట్ వాటాలో సుమారు 11 శాతం వాటాతో టీవీఎస్ మోటార్, బజాజ్ ఆటో, ఏథర్ ఎనర్జీ తర్వాత నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఓలా ఎలక్ట్రిక్, గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లాంటి బ్రాండ్ల కంటే ముందంజలో ఉంది. విడా అమ్మకాల వృద్ధి కూడా శరవేగంగా కొనసాగుతోంది.

మొదటి లక్ష స్కూటర్ల అమ్మకాలకు దాదాపు 33 నెలలు పట్టింది. అయితే, లక్ష నుంచి రెండు లక్షల యూనిట్లకు చేరుకోవడానికి కేవలం ఏడు నెలల సమయం మాత్రమే పట్టింది. ఇక రెండు లక్షల నుంచి మూడు లక్షల అమ్మకాల మైలురాయిని చేరుకోవడానికి కేవలం ఐదు నెలలే పట్టడం, మార్కెట్లో విడా స్కూటర్లకు పెరుగుతున్న డిమాండ్‌ను స్పష్టంగా తెలియజేస్తోంది.

ఈ ఏడాది విడా నెలవారీ అమ్మకాలలో కూడా కొత్త రికార్డులు నమోదు చేసింది. జూన్‌లో 21,893 యూనిట్లు విక్రయించగా, జూలైలో ఆ సంఖ్య 22,883 యూనిట్లకు చేరి కంపెనీ చరిత్రలోనే అత్యధిక నెలవారీ అమ్మకాలుగా నమోదైంది. ఒకే క్యాలెండర్ సంవత్సరంలో రెండు లక్షలకు పైగా స్కూటర్లను విక్రయించే దిశగా కంపెనీ దూసుకెళ్తోంది. 2026 చివరి నాటికి మొత్తం అమ్మకాలు సుమారు 2.25 లక్షల నుంచి 2.35 లక్షల యూనిట్ల మధ్య ఉండొచ్చని తెలుస్తోంది.

విడా విజయానికి కారణాలు

విడా సక్సెస్‌కు ప్రధాన కారణాల్లో ఒకటి బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ విధానం. ఈ మోడల్‌లో వినియోగదారులు బ్యాటరీని వేరుగా తీసుకునే అవకాశం ఉండటంతో స్కూటర్ ప్రారంభ ధర తగ్గుతుంది. దీంతో ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు మరింత అందుబాటులోకి వచ్చింది. ఈ విధానాన్ని తర్వాత ఇతర కంపెనీలు కూడా ఫాలో అయ్యాయి. మార్కెట్ విస్తరణపై కూడా హీరో మోటోకార్ప్ దృష్టి పెట్టింది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 415 నగరాల్లో, 700కు పైగా డీలర్ల ద్వారా, మొత్తం 900కు పైగా టచ్‌పాయింట్లతో విడా సర్వీసులు అందిస్తోంది. వినియోగదారుల సౌకర్యం కోసం దేశవ్యాప్తంగా 5,900కు పైగా ఛార్జింగ్ పాయింట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఏథర్ గ్రిడ్ నెట్‌వర్క్‌ను కూడా విడా కస్టమర్లు ఉపయోగించుకోవచ్చు.

మొత్తంగా విడా ఎలక్ట్రిక్ స్కూటర్లకు దేశవ్యాప్తంగా డిమాండ్ వేగంగా పెరుగుతోంది. పెరుగుతున్న మార్కెట్ వాటా, కొత్త అమ్మకాల రికార్డులు, డీలర్ నెట్‌వర్క్ విస్తరణ, ఛార్జింగ్ సౌకర్యాలు, ఉత్పత్తి సామర్థ్య పెంపు లాంటి అంశాలు విడా సక్సెస్‌ను మరింత బలోపేతం చేయనున్నాయి. పర్యావరణ హితమైన ప్రయాణానికి మద్దతునిస్తూ అధునాతన టెక్నాలజీతో వస్తున్న ఈ స్కూటర్లు భవిష్యత్తులో ఆటోమొబైల్ రంగంలో మరిన్ని సంచలనాలు సృష్టించడం ఖాయం.

Follow Us