AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND Vs WI: హైదరాబాద్‌లో భారత్-విండీస్ పోరు.. వైభవ్‌ సూర్యవంశీకి చోటు దక్కుతుందా?

IND Vs WI: భారత్, వెస్టిండిస్ మధ్య హైదరాబాద్‌లో నాలుగో టీ20 మ్యాచ్ జరగనుంది. రాజీవ్ గాంధీ స్టేడియం వేదికగా జరిగే ఈ పోరులో విన్నింగ్ కాంబినేషన్‌తోనే బరిలోకి దిగాలని టీమిండియా భావిస్తోంది. వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కడం కష్టంగా కనిపిస్తోంది.

IND Vs WI: హైదరాబాద్‌లో భారత్-విండీస్ పోరు.. వైభవ్‌ సూర్యవంశీకి చోటు దక్కుతుందా?
India Vs West Indies
Rakesh
|

Updated on: Oct 14, 2026 | 8:32 AM

Share

IND Vs WI: భారత్, వెస్టిండిస్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ అత్యంత రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ముగియగా, తొలి మ్యాచ్‌లో భారత్ విజయం సాధించగా.. రెండో మ్యాచ్‌లో విండిస్ జట్టు గెలుపొందింది. ఇక మూడో మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన భారత్ మళ్లీ విజయం సాధించి సిరీస్‌లో ఆధిక్యంలో నిలిచింది. ఇప్పుడు ఇరు జట్ల మధ్య అత్యంత కీలకమైన నాలుగో టీ20 మ్యాచ్ బుధవారం అక్టోబర్ 14వ తేదీన హైదరాబాద్‌లోని ప్రసిద్ధ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనుంది.

బుడ్డోడికి తుది జట్టులో చోటు దక్కుతుందా?

హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియం పిచ్ బ్యాటర్లకు ఎంతో అనుకూలంగా ఉంటుందనే సంగతి తెలిసిందే. ఈ మైదానంలో పరుగుల వరద పారడం ఖాయం. అయితే ఈ మ్యాచ్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో అవకాశం లభిస్తుందా అనే దానిపై సర్వత్రా చర్చ నడుస్తోంది. క్రీజులోకి రాగానే ఫోర్లు, సిక్సర్లతో చెలరేగే వైభవ్‌ను చూడాలని అభిమానులు ఆశపడుతున్నప్పటికీ, అతడు మరోకసారి బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆసియా క్రీడలలో అభిషేక్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేసిన వైభవ్, ప్రస్తుత టీమిండియా కాంబినేషన్‌లో వెంటనే చోటు దక్కించుకోవడం కష్టంగా మారింది.

ఇది కూడా చదవండి: IPL 2027: ఐపీఎల్ 2027 సమావేశం వాయిదా.. అసలు కారణం ఏంటంటే?

మార్పులు లేకుండానే బరిలోకి టీమిండియా

గత మూడో టీ20 మ్యాచ్‌లో వెస్టిండిస్‌పై 14 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన భారత జట్టు, అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. విజయవంతమైన కాంబినేషన్‌ను మార్చడానికి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఇష్టపడే అవకాశం లేదు. దీంతో నాలుగో టీ20లోనూ ఎలాంటి మార్పులు లేకుండా సేమ్ టీమ్‌తో బరిలోకి దిగాలని మేనేజ్‌మెంట్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్ వంటి మ్యాచ్ విన్నర్లు మరోసారి బెంచ్‌పైనే కూర్చోవాల్సి రావచ్చు.

ఇది కూడా చదవండి: Test Match: వీడు మనిషా మిషనా.. 8 గంటల పాటు బ్యాటింగ్ చేసి మ్యాచ్ డ్రా చేశాడుగా

భారత్ ప్లేయింగ్ ఎలెవన్(అంచనా)

అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, నమన్ ధీర్, అక్షర్ పటేల్, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us