AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP DSC notification: డీఎస్సీ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. 2,721 పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల!

AP DSC notification Release: ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు కూటమి సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ప్రతి సంవత్సరం డీఎస్సీ పోస్టులు భర్తీ చేస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు తాజాగా ప్రభుత్వం మరో డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్, పురపాలక పాఠశాలల్లో కలిపి మొత్తం 2,721 ఉద్యోగాల భర్తీకి గాను మూడు వేర్వేరు నోటిఫికేషన్లు రిలీజ్ చేసింది.

AP DSC notification: డీఎస్సీ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. 2,721 పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల!
Ap Dsc Notification
Anand T
|

Updated on: Oct 14, 2026 | 8:32 AM

Share

టీచర్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు చంద్రబాబు సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రతి ఏడాది డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటిస్తామని ఎన్నికల టైంలో ఇచ్చిన హామీలో భాగంగా తాజాగా మరో ఏపీ డీఎస్సీ షార్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. 2 వేల 721 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్, పురపాలక పాఠశాలల్లో కలిపి మొత్తం మూడు వేర్వేరు నోటిఫికేషన్లను రిలీజ్ చేసింది ప్రభుత్వం. జనరల్ స్కూళ్లలో 2,111 పోస్టులను, స్పెషల్ ఎడ్యుకేషన్‌లో 350 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు.

అలాగే సొసైటీలు, ఇతర యాజమాన్యాల్లో 260 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇక స్కూల్ అసిస్టెంట్ కోసం- 906 పోస్టులు, SGT-1,205 పోస్టులు ఉన్నాయి. SA స్పెషల్ ఎడ్యుకేషన్-150 పోస్టులు, SGT స్పెషల్ ఎడ్యుకేషన్-200 పోస్టులు, ప్రిన్సిపాల్-30, PGT-81 పోస్టులను భర్తీ చేస్తామని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. అలాగే TGT-113, ఫిజికల్ డైరెక్టర్-2, PET-34 పోస్టులను భర్తీ చేస్తున్నట్టు స్పష్టం చేశారు. నవంబర్ 3లోపు పూర్తి నోటిఫికేషన్ జారీ చేసి.. ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను కూడా ప్రారంభిస్తామని తెలిపారు.

అయితే త్వరలో రిలీజ్ చేయబోయే పూర్తి నోటిఫికేషన్‌లో ఖాళీలు, రిజర్వేషన్లు, అర్హతల వివరాలను స్పష్టంగా ప్రకటిస్తామని విద్యాశాఖ అధికారులు తెలిపారు. అయితే తొలుత నిర్ణయించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం.. ఈ నోటిఫికేషన్ గురువారం రావాల్సి ఉంది. కానీ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ నేపథ్యంలో ఈ డీఎస్సీ నోటిఫికేషన్‌ను ముందుగానే రిలీజ్ చేసినట్టు అధికారులు తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us